సంక్రాంతి సుగుణసుందరితో శ్రీదేవి పోటీ.. ఎవ‌రు గెలిచారు…!

వచ్చే సంక్రాంతికి టాలీవుడ్ సీనియర్ హీరోలైన బాలకృష్ణ, చిరంజీవి నటిస్తున్న వీర సింహారెడ్డి, వాల్తేరు వీరయ్య సినిమాలు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి. ఈ రెండు సినిమాలను టాలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థ అయిన మైత్రి మూవీ మేకర్స్ వారు నిర్మిస్తున్నారు. అదేవిధంగా ఈ రెండు సినిమాలలోనూ అందాల భామ శృతిహాసన్ హీరోయిన్‌గా నటిస్తుంది. అటు బాలయ్య తో ఇటు చిరంజీవితో శృతి వేసిన స్టెప్స్ ఇప్పటికే అందర్నీ అదరహో అనిపించాయి.

సంక్రాంతి పోరు అనేది హీరోలకే కాకుండా హీరోయిన్స్ మధ్య కూడా ఎంతో రసవత్తరంగా జరుగుతుంది. అయితే వచ్చే సంక్రాంతికి మాత్రం శృతితో శృతికే పోటీ జరుగునుంది. బాక్సాఫీస్ వద్ద ఈ రెండు సినిమాలలో ఏ సినిమా హిట్ అయిన సంక్రాంతి విన్నర్ శృతిహాసన్ అవుతుంది. ఈ సినిమాలతో పాటు కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ నటిస్తున్న వారసుడు సినిమా కూడా సంక్రాంతి బరిలో ఉంది.

ఈ సినిమాలో విజయ్ కి జంటగా అందాల భామ రష్మికా మందన్ననటించింది. శృతికి ఈ సినిమాతో రష్మిగా కూడా పోటీ ఇవ్వనుంది. టాలీవుడ్ లో మాత్రం శృతిహాసన్ దే పై చేయి అవ్వనుంది. మరి ఇటు చిరు అటు బాలయ్యతో ఇప్పటికే క్రేజీ స్టెప్స్ వేసి ఇరు అభిమానులని ఎట్రాక్ట్ చేస్తుంది శృతి. ముఖ్యంగా వీర సింహా రెడ్డిలో చాలా హాట్ గా కనిపిస్తూ యువ‌త‌ను ఆకట్టుకుంటుంది.

Waltair Veerayya Latest News in iDreamPost, Waltair Veerayya Top Headline,  Photos, Videos Online | iDreamPost

మరి ఈ రెండు సినిమాల్లో తన అందం అభినయం తో ఎక్కువ మార్కులు ఎందులో స్కోర్ చేస్తుందో చూడాలి. ఏదేమైనా వచ్చే సంక్రాంతికి చిరు , బాలయ్య మధ్యలో ప్రతీ థియేటర్స్ లో శృతి పోస్టర్ పడబోతుంది. ఇక మైత్రి కి కూడా ఇదో గొప్ప అనుభూతిగా మారనుంది. ఒకే బేనర్ నుంచి సంక్రాంతి రెండు పెద్ద సినిమాలు రిలీజ్ అవ్వడం ఇదే మొదటి సారి మరి.