బాలయ్య హీరోయిన్ హనీ రోజ్‌కు తెలుగులో ఫ‌స్ట్ సినిమా ఏదో తెలుసా..!

నందమూరి బాలకృష్ణ ‘అఖండ’ లాంటి సూపర్ హిట్ తర్వాత నటిస్తున‌ తాజా సినిమా ‘వీరసింహారెడ్డి’. ఈ సినిమాను సంక్రాంతి కానుకగా జనవరి 12న ప్రేక్షకులు ముందుకు తీసుకురాబోతున్నారు. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ కంప్లీట్ అవ్వగా.. ఈ సినిమా ప్రమోషన్ లో భాగంగా ఈ సినిమా నుంచి వచ్చిన టీజర్, సాంగ్స్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఇప్పటికే ఈ సినిమా నుంచి మూడు పాటలు రాగా అవీ కూడా సూపర్ సెన్సేషన్ క్రియేట్ చేశాయి.

తాజాగా వచ్చిన ‘మా బావ మనోభావాలు’ అనే మాస్ సాంగ్ ప్రస్తుతం యూట్యూబ్‌ను షేక్ చేస్తుంది. సూపర్ సెన్సేషన్ అయినా ఈ పాటలో బాలయ్య పక్కన చంద్రిక రవి ఐటెం గాల్ గా ఎంతో హాట్ గా కనిపించింది.
ప్రస్తుతం టాప్ ట్రెండింగ్ లో ఉన్న ‘మా బావ మనోభావాలు’ సాంగ్‌లో చంద్రిక రవి కన్నా నెటిజెన్స్ ని ఆడియన్స్ ని ఎక్కువగా అట్రాక్ట్‌ చేసిన బ్యూటీ హనీ రోజ్.

బ్లాక్ శారీలో కనిపించిన హనీ రోజ్- బాలయ్యతో చేసిన మాస్ డాన్స్ ప్రేక్షకులను ఎంతగానో మెప్పించింది. బాలయ్య- హనీ రోజ్‌ జంట బాగుడంతో సినీ అభిమానులంతా ఈ హీరోయిన్ ఎవరు..? ఎక్కడి నుంచి తీసుకొచ్చారు అంటూ ఆరా తీయడం మొదలుపెట్టారు. ఆ పాటలో కనిపించిన హనీ రోజ్ వర్గీస్ కేరళ అమ్మాయి. తన 14వ సంవత్సరంలోనే హీరోయిన్‌గా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది హనీ రోజ్.

honey rose - MixIndia

మలయాళ చిత్ర పరిశ్రమంలో స్టార్ హీరోలుగా ఉన్న ముమ్ముట్టి, మోహన్ లాల్, సురేష్ గోపి, ఫాహ‌ద్ ఫ‌జిల్ వంటి స్టార్ హీరోల సినిమాల్లో నటించి మెప్పించింది. మలయాళీ సూపర్ స్టార్ అయిన మోహన్ లాల్‌తో బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేసి మలయాళ చిత్ర పరిశ్రమంలో స్టార్ హీరోయిన్‌గా గుర్తింపు తెచ్చుకుంది.
అక్కడ స్టార్ హీరోయిన్‌గా గుర్తింపు తెచ్చుకున్న హనీ రోజ్ తెలుగులో వీర సింహారెడ్డి సినిమా నే మొదటి సినిమా కాదట.. 2008లోనే ‘ఆలయం’ అనే సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది హనీ రోజ్‌.

Aalayam Telugu Movie Part 01/02 || Sivaji, Honey Rose || Shalimarcinema -  YouTube

ఆ తర్వాత ఐదేళ్లకి ‘మళ్ళీ ఈ వర్షం సాక్షిగా’ అనే సినిమాలో వరుణ్ సందేశ్ కు జంటగా నటించిన హనీ రోజ్.. దాదాపు పది సంవత్సరాలు తర్వాత మళ్లీ ‘వీర సింహారెడ్డి’ సినిమాతో తెలుగు ప్రేక్షకులు ముందుకు రాబోతుంది. ఈ సినిమాతో ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తుందో తెలియాలంటే జనవరి 12 వరకు వేచి చూడాల్సిందే.