ఆషు రెడ్డి..చేస్తున్న పనికి ఎవరైనా సూపర్ అనాల్సిందే..!!

తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు బిగ్ బాస్ ,రాంగోపాల్ వర్మతో ఇంటర్వ్యూ చేసి గోల్డెన్ బ్యూటీగా పేరు తెచ్చుకున్న అషురెడ్డి గురించి ప్రత్యేకంగా పరిచయం చేయనవసరం లేదు. మొదటగా సోషల్ మీడియాలో డబ్స్ మ్యాచ్ వీడియోల ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకున్న ఆషురెడ్డి బిగ్ బాస్ లోకి ఎంట్రీ ఇచ్చి మరింత పాపులారిటీని సంపాదించుకుంది. అంతేకాకుండా ఈ బ్యూటీ కి సమంత పోలికలు ఉండడం ప్లస్ అని చెప్పవచ్చు.

ఆషురెడ్డి సోషల్ మీడియాలో హాట్ ఫోటో షూట్స్ చేసి సోషల్ మీడియాలో ట్రోలింగ్స్ ని ఎదుర్కొంటూ ఉంటుంది. ఆమె వేసే పొట్టి డ్రెస్సులతో ఆమె ఎద, నడుము అందాలను కనపరుస్తూ ఉంటుంది. అయితే చాలామందికి ఆషురెడ్డి పేరు వినగానే ఆమెని చాలామంది తప్పుగా అర్థం చేసుకుంటూ ఉంటారు.. మరికొందరు బోల్డ్ ఇంటర్వ్యూలో తప్ప ఈమెకు ఏమి తెలుసు అనే అభిప్రాయాలలో ఉంటారు. తాజాగా రొమాంటిక్ సినిమా ప్రమోషన్స్ సమయంలో ఆర్జీవి పాదాల కింద కూర్చొని ఆమె పాదాలను నాకించుకొని బోల్డ్ బ్యూటీగా గుర్తింపు తెచ్చుకుంది.ఆ ఇంటర్వ్యూ తర్వాత చాలామందికి అషురెడ్డి అంటేనే విరక్తి పుడుతోంది. కానీ అషు రెడ్డి తాజగా పోస్ట్ ని చూసి అషురెడ్డి ఇంత మంచితనం కూడా ఉందా అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేశారు.

నాకు దేవుడిచ్చిన పిల్లలు ఉన్నారు. వారిని చదివిస్తూ.. సాయం చేస్తూ నాకు ఉన్నంతలో వారికి అండగా ఉన్నాను. ముఖ్యంగా ఇద్దరి అమ్మాయిలను చదివిస్తున్నాను. వారి పేరు కళ్యాణి, శ్రేయ వాళ్లు డిగ్రీ పూర్తి చేయటం నాకు చాలా సంతోషంగా ఉంది. వారి ప్రేమను పొందేందుకు నాకేం అర్హత ఉందో తెలియడం లేదు. ఇప్పుడు నేను అందరికీ ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. ఒకరికి ఉపయోగపడే స్తోమత మనకు ఆ దేవుడి ఇస్తే. ఖచ్చితంగా సహాయపడాలి నాకు ఈ అవకాశాన్ని దేవుడు కలిగించాడు కాబట్టి వీరికి నేను హెల్ప్ చేశాను. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి అని ఆషురెడ్డి కొన్ని మాటలను పోస్ట్ ద్వారా తెలియజేసింది.

 

View this post on Instagram

 

A post shared by Ashu Reddy (@ashu_uuu)