రాజాంలో తగ్గని గ్రీష్మ..టీడీపీకి తలనొప్పి.!

రాజాం నియోజకవర్గంలో టీడీపీ అంతర్గత విభేదాలు తగ్గడం లేదు. సీటు కోసం నేతల మధ్య పోటీ తీవ్రమవుతుంది. ఇటీవల చంద్రబాబు రాజాంకు వచ్చినా సరే సీటు విషయం తేలలేదు. దీంతో ఇటు ఇంచార్జ్ కొండ్రు మురళీమోహన్, అటు మాజీ స్పీకర్ ప్రతిభా భారతి వర్గాల మధ్య విభేదాలు కొనసాగుతున్నాయి. గత ఎన్నికల్లో ప్రతిభాని తప్పించి కొండ్రుకు రాజాం సీటు ఇచ్చారు. కానీ కొండ్రు ఓడిపోయారు. ఓడిపోయాక కొన్ని రోజులు అడ్రెస్ లేరు. మళ్ళీ టీడీపీ బలపడుతుండటంతో కొండ్రు ఎంట్రీ ఇచ్చి ఇంచార్జ్ గా దూకుడుగా పనిచేస్తున్నారు.

అదే సమయంలో రాజాం సీటుపై ప్రతిభా కుమార్తె గ్రీష్మ కూడా ఫోకస్ చేశారు. ఆ సీటు దక్కించుకోవడం కోసం ఆమె సైతం యాక్టివ్ గా పనిచేస్తున్నారు. అయితే ఇటీవల చంద్రబాబు రాజాం టూర్ సక్సెస్ చేయడానికి రెండు వర్గాలు గట్టిగానే ప్రయత్నించాయి. పోటీ పడి కార్యక్రమం చేశారు. కాకపోతే చంద్రబాబు..కాస్త కొండ్రు వైపే మొగ్గు చూపుతున్నారని తెలుస్తోంది. రాజాం రోడ్ షోలో కూడా బాబు పక్కనే కొండ్రు ఉన్నారు. మధ్యలోనే ప్రతిభా వెనక్కి తిరిగి వెళ్ళిపోయారు.

దీంతో రాజాం సీటు కొండ్రుకే అని ఆయన వర్గం ప్రచారం చేస్తుంది. కానీ ఈ సీటుని గ్రీష్మ వదులుకోవడం లేదు. గత ఎన్నికల్లో ప్రతిభా చంద్రబాబు చెప్పినట్లు విని సైడ్ అయ్యారు గాని..గ్రీష్మ మాత్రం పట్టు విడవడం లేదు. పైగా రాజాం సీటు ఇవ్వాలని నారా లోకేశ్ ద్వారా లాబీయింగ్ చేస్తున్నారు. ఎట్టి పరిస్తితుల్లోనూ సీటు వదిలేలా లేరు.

అయితే చంద్రబాబు ఈ సీటుని త్వరగా తేల్చకపోతే పార్టీలో అంతర్గత విభేదాలు ముదిరి పార్టీకి ఇంకా నష్టం చేకూరుస్తాయి. చివరికి రాజాం సీటు ఎవరికి దక్కుతుందో చూడాలి.