పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, `సాహో` ఫేమ్ సుజిత్ కాంబినేషన్లో ఓ సినిమా తెరకెక్కబోతున్న సంగతి తెలిసిందే. రీసెంట్ గా ఈ ప్రాజెక్టు పై అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చింది. `ఒరిజినల్ గ్యాంగ్ స్టార్ ` అంటూ ఇప్పటికే పవన్ ప్రీ లుక్ ను సైతం బయటకు వదిలారు.
డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై డీవీవీ దానయ్య ఈ చిత్రాన్ని నిర్మించబోతున్నారు. `ఆర్ఆర్ఆర్` వంటి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ అనంతరం డీవీవీ దానయ్య నిర్మిస్తున్న చిత్రమిది. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటున్న ఈ చిత్రం వచ్చే ఏడాది పట్టాలెక్కే అవకాశాలు ఉన్నాయి.
అయితే ఇప్పుడు ఈ చిత్రానికి పవన్ అందుకుంటున్న రెమ్యునరేషన్ హాట్ టాపిక్‌గా మారింది. లేటెస్ట్ సమాచారం ప్రకారం.. సుజిత్ మూవీకి పవన్ రికార్డు స్థాయిలో రెమ్యునరేషన్ అందుకుంటున్నాడట. నిర్మాత దానయ్య పవన్ కు రూ. 70 కోట్ల రెమ్యునరేషన్ ఇస్తానని కమిట్ అయ్యారట. అందులో భాగంగానే రూ. 25 కోట్లు ఇప్పటికే అడ్వాన్స్ కింద ఆయనకు పంపారని ప్రచారం జరుగుతోంది.