`వీర సింహారెడ్డి`లో ఎన్టీఆర్‌.. నంద‌మూరి ఫ్యాన్స్ పండ‌గ చేసుకోండెహే!

`అఖండ‌` వంటి బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ అనంత‌రం నట సింహం నందమూరి బాలకృష్ణ గోపీచంద్ మలినేని ద‌ర్శ‌క‌త్వంలో `వీర సింహారెడ్డి` అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో శ్రుతిహాసన్ హీరోయిన్ గా నటిస్తోంది. కన్నడ నటుడు దునియా విజయ్ విలన్ గా చేస్తుంటే.. వరలక్ష్మి శరత్ కుమార్ కీలకపాత్రను పోషిస్తుంది.

మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై నిర్మితమవుతున్న ఈ ఈ మాస్ ఎంటర్టైనర్ చిత్రం వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 12న గ్రాండ్ రిలీజ్ కాబోతోంది. దాదాపు షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం శ‌ర‌వేగంగా పోస్ట్ ప్రొడెక్ష‌న్ ప‌నుల‌ను జ‌రుపుకుంటోంది. ఇదిలా ఉంటే.. తాజాగా ఈ సినిమాకు సంబంధించి నంద‌మూరి ఫ్యాన్స్ పండ‌గ చేసుకునే న్యూస్ ఒక‌టి నెట్టింట వైర‌ల్ గా మారింది.

అదేంటంటే.. ఈ చిత్రంలో ఎన్టీఆర్ కూడా భాగం కాబోతున్నాడ‌ట‌. బాబాయ్ సినిమాకు ఎన్టీఆర్ వాయిస్ ఓవర్ ఇవ్వబోతున్నడట. డైరెక్టర్ గోపీచంద్ మలినేని రిక్వెస్ట్ మేరకు ఈ సినిమా కోసం వాయిస్ ఓవర్ ఇచ్చేందుకు ఎన్టీఆర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట. కాగా, గ‌త‌ కొంతకాలం నుంచి బాబాయ్ బాలయ్య అబ్బాయి ఎన్టీఆర్ మధ్య మనస్పర్ధలు ఏర్పడ్డాయనే వార్త‌లు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ వార్తలకు చెక్‌ పెట్టేందుకే `వీర సింహారెడ్డి`లో భాగం అవ్వాల‌ని ఎన్టీఆర్ డిసైడ్ అయిన‌ట్లు టాక్ నడుస్తోంది.