సినీ ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ ఏ రేంజ్ లో ఉందో మనకు తెలిసిందే. ఇప్పటికే చాలామంది హీరోయిన్లు ఇలా క్యాస్టింగ్ కౌచ్ బారిన పడి ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. అయితే ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా ఎదగాలి అంటే కమిట్మెంట్ ఇవ్వాల్సిందే అంటూ మరికొంతమంది హీరోయిన్లు బాహటంగా ప్రకటిస్తున్న విషయం తెలిసిందే . మరి కొంత మంది క్యాస్టింగ్ కౌచ్ బారిన పడలేక ఇండస్ట్రీని వదిలి వెళ్ళిపోతున్నారు. ఇంకొంతమంది ధైర్యంగా ఇంకొక ఇండస్ట్రీలో తమ వృత్తిని కొనసాగించడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఇకపోతే కొంతమంది హీరోలు, దర్శక నిర్మాతల వల్ల.. అవకాశాల కోసం నమ్మి వారి దగ్గరకు వెళ్తే వారి చేసే పనుల వల్ల మానసికంగా మరింత కృంగిపోతున్నారని చెప్పవచ్చు.
ఈ క్రమంలోనే ప్రముఖ యంగ్ హీరోయిన్ గా గ్లామర్ షో కి కేరాఫ్ అడ్రస్ గా నిలిచిన వర్మ హీరోయిన్ అప్సర రాణి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. థ్రిల్లర్, డేంజరస్ సినిమాల ద్వారా తన అందాలను బికినీ షోలలో చూపించి మరింత రచ్చ చేసిన ఈ ముద్దుగుమ్మ వర్మ సినిమాలలో నటించి భారీ స్థాయిలో పాపులారిటీని దక్కించుకుంది. ఇదిలా ఉండగా ఇటీవల ఒక మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో అప్సర రాణి మాట్లాడుతూ ఎమోషనల్ అవడం ప్రస్తుతం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది.
అప్సరరాణి మాట్లాడుతూ.. కన్నడ ఇండస్ట్రీలో మొదటిసారి సినిమా అవకాశాల వేటలో పడ్డప్పుడు ఒక స్టార్ డైరెక్టర్ అవకాశం ఇస్తానని, అయితే సినిమా డిస్కషన్ కోసం ఒక్కదానినే గదికి రమ్మని పిలిచారు. అయితే నేను మా నాన్నను వెంటపెట్టుకొని వెళ్ళాను. కానీ నాన్న బయట ఉండగా నేను లోపలికి వెళ్లాను అయితే అక్కడ పరిస్థితి గమనించలేదు. కానీ అతడు వెంటనే నిన్ను హీరోయిన్ చేయాలంటే నువ్వు నాతో పడుకోవాల్సిందే అంటూ చేయి పట్టుకో పోయాడు.. పరిస్థితి అర్థం అయి.. వెంటనే గట్టిగా అరచి నాన్నతో కలిసి పారిపోయాను అంటూ ఎమోషనల్ అయింది అప్సర రాణి.అయితే తెలుగు ఇండస్ట్రీలో తనకు ఎలాంటి చేదు అనుభవం ఎదురు కాలేదని కూడా స్పష్టం చేసింది.