మిల్కీ బ్యూటీ తమన్నా త్వరలోనే `గుర్తుందా శీతాకాలం` సినిమాతో ప్రేక్షకులను పలకరించబోతున్న సంగతి తెలిసిందే. సత్యదేవ్ హీరోగా తెరకెక్కిన ఈ చిత్రానికి నాగ శేఖర్ దర్శకత్వం వహించాడు.
ఇందులో మేఘా ఆకాష్, కావ్యశక్తి, సుహాసిని, ప్రియదర్శి తదితరులు కీలక పాత్రలు పోషించగా.. కాలభైరవ సంగీతాన్ని అందించాడు. నాగశేఖర్ మూవీస్ బ్యానర్‌పై నాగశేఖర్, భావన, రవి సంయుక్తంగా నిర్మించారు.
అనేక వాయిదాల అనంతరం ఈ చిత్రాన్ని డిసెంబర్ 9న ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు. ఈ నేపథ్యంలోనే మేకర్స్ జోరుగా ప్రచార కార్యక్రమాలను నిర్వహిస్తూ సినిమాపై హైప్ క్రియేట్ చేస్తున్నారు.
అయితే తాజాగా మేకర్స్ గుర్తుందా శీతాకాలం ప్రీ రిలీజ్ ఈవెంట్ ను నిర్వహించారు. ఈ ఈవెంట్లో తమన్నా స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచింది. బ్లాక్ అండ్ వైట్ మినీ డ్రెస్ లో థండర్ థైస్ ను చూపిస్తూ సెగలు రేపింది.
తమన్నా తాజా పిక్స్ నెట్టింట వైరల్ గా మారాయి. వీటిని చూసి కుర్రాళ్లు ఆగమాగం అయిపోతున్నారు. అంత హాట్ గా తమన్నా దర్శనమిచ్చింది. మరి ఈ అమ్మడుకు గుర్తుందా శీతాకాలం ఎలాంటి విషయాన్ని అందిస్తుందో చూడాలి.