ఎన్టీఆర్ త్రిబుల్ ఆర్ తర్వాత తన తర్వాత సినిమాని కొరటాల శివతో అనౌన్స్ చేశాడు. ఆయన పుట్టిన రోజు సందర్భంగా ఈ సినిమాకు సంబంధించిన మోషన్ పోస్టర్ను కూడా విడుదల చేశారు. అయితే ఆ పోస్టర్ వచ్చి 8 నెలలు గడుస్తున్నా ఇప్పటికీ ఈ సినిమా స్టేట్స్ మీదకు వెళ్లలేదు. అదుగో అప్పుడు ఇదిగో ఇప్పుడు అని చెప్పి ఎన్నోసార్లు ఊరించారు. తర్వాత ఫ్యాన్స్ కు నిరాశ కలిగించారు. అందులో ఈ సినిమాకు సంబంధించి అలాంటి అప్డేట్ కూడా ఇవ్వలేదు.
ఆ సమయంలో ఈ సినిమా రద్దయిందనే పుకార్లు కూడా వచ్చాయి. కానీ అందులో ఏం మాత్రం వాస్తవం లేదని సినిమా యూనిట్ తో కొరటాల చర్చిస్తున్న ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఈ ప్రాజెక్టు లైన్లో ఉందని తెలిపాడు. అయితే ఇక్కడ వరకు బాగానే ఉంది కానీ.. ఈ సినిమా షూటింగ్ ఎప్పుడు మొదలవుతుందనేదే పెద్ద అంతు చిక్కని ప్రశ్నగా మారింది. అయితే ఇప్పుడు ఆ ప్రశ్నకు సమాధానం చిక్కింది.
ఈ సినిమా షూటింగ్ కి సంబంధించిన ముహూర్తం ఖరారు చేసినట్టు ఈ సినిమా యూనిట్ లేటెస్ట్ గా అప్డేట్ బయటకు వచ్చింది. సినీ వర్గాల నుంచి అందుకున్న వార్తల ప్రకారం ఈ సినిమా షూటింగ్ సంక్రాంతి రోజున ఎంతో ఘనంగా ప్రారంభించబోతున్నారట. అనంతరం ఫిబ్రవరి నుంచి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ గ్యాప్ లేకుండా మొదలుకానుందని తెలుస్తుంది. దీనికోసం మేకర్స్ ఫ్రీ ప్రొడక్షన్ వర్క్ ను కూడా మొదలుపెట్టినట్టు తెలుస్తుంది.
అయితే ప్రస్తుతం ఎన్టీఆర్ వెకేషన్ లో ఉండగా.. వెకేషన్ నుంచి తిరిగి రాగానే ఈ సినిమా పూజా కార్యక్రమాలు నిర్వహించబోతున్నట్లు తెలుస్తుంది. ఈ సినిమా షూటింగ్ మొదలైన వెంటనే ఎలాంటి గ్యాప్ తీసుకోకుండా జట్ స్పీడ్ లో ఈ సినిమా షూటింగ్ నిర్వహించేలా కొరటాల పక్క ప్లాన్ చేశాడని సమాచారం.
అన్ని అనుకున్న విధంగా జరిగితే ఈ సినిమాను వచ్చే ఏడాదిలోనే రిలీజ్ చేయనున్నారు అని కూడా తెలుస్తుంది. ఈ వార్త నిజమైతే మాత్రం ఎన్టీఆర్ అభిమానులకు పండగే.. ఎప్పుడు ఎప్పుడు అని ఎదురుచూస్తున్న వారి నిరీక్షణకు పుల్ స్టాప్ పడినట్టే. ఇక త్వరలోనే ఈ సినిమా షూటింగ్ పై అధికార ప్రకటన కూడా రానుంది.