ఆ హీరో కోసం రూల్స్ బ్రేక్ చేసిన మహేశ్ బాబు .. చరిత్రలోనే ఇది సంచలన రికార్డ్..!!

ప్రజెంట్ సినిమా ఇండస్ట్రీలో ఉండే అందరి కళ్ళు సంక్రాంతి రేసులో ఉండే సినిమాలు పైనే పడింది. మొదటగా నందమూరి బాలయ్య నటిస్తున్న” వీరసింహారెడ్డి” సినిమా జనవరి 12న గ్రాండ్గా థియేటర్స్ రిలీజ్ కానుంది . ఇప్పటికే సినిమా నుంచి రిలీజ్ అయిన ప్రతి అప్డేట్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతూనే ఉంది. కాగా ఆ పక్క రోజే మెగాస్టార్ చిరంజీవి నటించిన “వాల్తేరు వీరయ్య ” కూడా గ్రాండ్గా థియేటర్స్ రిలీజ్ కాబోతుండటంతో మెగా ఫ్యాన్స్ కూడా సినిమాపై బోలెడన్ని ఎక్ష్పెక్టేషన్స్ పెట్టుకుని ఉన్నారు. ఇక కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ చేస్తున్న వారసుడు సినిమా గురించి తెలుగు జనాలు పెద్దగా పట్టించుకోవడం లేదు.

కాగా సంక్రాంతి సీజన్ అవ్వగానే సమ్మర్ కానుకగా మహేష్ బాబు తన నెక్స్ట్ సినిమాను రిలీజ్ చేయడానికి సిద్ధపడుతున్నాడు . ఈ క్రమంలోనే మహేష్ బాబు తన సినిమా కోసం ఇప్పటివరకు ఎప్పుడు చేయని పని చేయబోతున్నాడు అంటూ సోషల్ మీడియాలో ఇంట్రెస్టింగ్ చర్చ వైరల్ గా మారింది. సర్కారు వారి పాట సినిమా తర్వాత త్రివిక్రమ్ శ్రీనివాస్ రావు డైరెక్షన్లో మహేష్ బాబు నటిస్తున్న సినిమా ఎస్ ఎస్ ఎం బి 28 .. ఈ సినిమాకి అర్జునుడు అనే టైటిల్ ని ఫిక్స్ చేసినట్లు తెలుస్తుంది . ఇప్పటికే ఫిలిం ఛాంబర్ లో కూడా ఈ టైటిల్ ని రిజిస్ట్రేషన్ చేశారట.

రేపో మాపో సినిమా టైటిల్ పై అఫీషియల్ ప్రకటన కూడా రానుంది. కాగా ఈ క్రమంలోనే సినిమాలో గెస్ట్ రోల్ కోసం స్టార్ హీరో అల్లు అర్జున్ ని రంగంలోకి దింపినట్లు తెలుస్తుంది డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ రావు . అంతే కాదు ఆల్రెడీ షూట్ చేసిన సీన్ ని సినిమా నుంచి తొలగిస్తూ కొత్తగా అల్లు అర్జున్ తో రీషుట్ చేసే విధంగా త్రివిక్రమ్ ప్లాన్ చేశాడట . అయితే ఒకసారి తీసిన షూట్ ని మరోసారి రిషూట్ చేయడానికి ఇష్టపడని మహేష్ బాబు ..అల్లు అర్జున్ కోసం ఫస్ట్ టైం ఇలా చేయాడానికి ఓకే చెప్పారట.

ఇప్పటి వరకు మహేశ్ బాబు తన సినిమా ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత పెట్టుకున్న రూల్స్ ని బ్రేక్ చేయలేదట. ఫస్ట్ టైం అల్లు అర్జున్ కోసం చేస్తున్నాడు అనే న్యూస్ ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది. అంతేకాదు మహేష్ బాబు కెరియర్ లోని ఇది ఓ సంచలన రికార్డ్ అంటూ చెప్పుకొస్తున్నారు ఘట్టమనేని ఫ్యాన్స్ . మరి చూడాలి మహేష్ బాబు ఎందుకు అంతలా బన్నీ కోసం ఇంతటి త్యాగం చేశాడొ..అందులో అంత ప్రత్యేకత ఏముందో.. తెలియాలంటే సినిమా రిలీజ్ అయ్యే వరకు ఆగాల్సిందే..!!