సినిమా ఇండస్ట్రీలో ఎంత పెద్ద స్టార్ హీరో అయిన.. తనకంటూ కొన్ని కోరికలు ఉంటాయి. ఫలానా హీరోయిన్ తో నటించాలని.. ప్రధాన యాక్టర్ తో ఫైట్ చేయాలని ..పలానా దర్శకుడి డైరెక్షన్ లో సినిమా చేయాలని కొన్ని కోరికలు ఉంటాయి . అలా బాలయ్య తన కోరికను తీర్చుకోబోతున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. గత ఏడాది బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కిన అఖండ సినిమాతో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ ని తన ఖాతాలో వేసుకున్న నందమూరి బాలయ్య .. త్వరలోనే మరో బిగ్గెస్ట్ క్రేజీ హిట్ ను తన ఖాతాలో వేసుకోవడానికి రెడీగా ఉన్నాడు .
మల్టీ టాలెంటెడ్ గోపీచంద్ డైరెక్షన్లో తెరకెక్కిన వీర సింహారెడ్డి సినిమాను జనవరి 12న సంక్రాంతి కానుకగా గ్రాండ్గా థియేటర్స్ రిలీజ్ కానుంది . ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన ప్రతి అప్డేట్, పాటలు, పోస్టర్స్ అన్ని అభిమానులను అమితంగా ఆకట్టుకున్నాయి. ఈ క్రమంలోనే సినిమా సూపర్ డూపర్ హిట్ అవుతుంది అంటూ జోష్యం కూడా చెప్పేస్తున్నారు నందమూరి అభిమానులు . ఈ సినిమా సెట్స్ పై ఉండగానే స్టార్ట్ డైరెక్టర్ అనిల్ రావిపూడి డైరెక్షన్లో బాలయ్య మరో సినిమాకి కమిట్ అయిన విషయం తెలిసిందే.
కాగా ఈ సినిమాకు సంబంధించిన రీసెంట్ అప్డేట్ ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది. ఇప్పటికే ఈ సినిమాల్లో బాలయ్య కూతురుగా శ్రీలీల నటిస్తుంది. ఈ విషయాన్ని అఫీషియల్ గా అనౌన్స్ చేశాడు అనిల్ రావిపూడి . సినిమాలో బాలయ్యకు హీరోయిన్గా ప్రియాంక జ్వాలకర్ నటిస్తుందన్న వార్తలు ఎక్కువగా వినపడుతున్నాయి. కాగా ఇదే క్రమంలో సినిమాలో హాట్ ఐటమ్ సాంగ్ కోసం రష్మిక మందనాన్ని సెలెక్ట్ చేసినట్లు తెలుస్తుంది . అనిల్ రావిపూడి కి రష్మిక మందన బాగా క్లోజ్ .
“సరిలేరు నీకెవ్వరు ” టైంలో రష్మిక తో మంచి బాండింగ్ ఏర్పడింది. ఈ క్రమంలోని బాలయ్య సినిమాలో ఐటమ్ సాంగ్ చేయడానికి రిక్వెస్ట్ చేశాడట అనిల్ రావిపూడి. బాలయ్య మీద ఉండే ఇష్టంతో రష్మిక కూడా ఓకే చెప్పినట్లు తెలుస్తుంది . కాగా ఆన్ స్టాపబుల్ సీజన్ వన్ లో రష్మికతో నటించాలని ఉంది అంటూ బాలయ్య ఓపెన్ గానే చెప్పేసాడు. ఈ క్రమంలో ఆయన తన కోరిక తీర్చుకుంటున్నాడు అంటూ సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి . బాలయ్య తో డాన్స్ అంటే రష్మికకు దబిడి దిబిడే అంటున్నారు నందమూరి ఫ్యాన్స్.