కాజల్‌కి దొంగతనంగా ముద్దు పెట్టబోయాడు.. పిక్ వైరల్ కావడంతో నెటిజన్లు రచ్చ!

మరో మూడు రోజుల్లో కొత్త సంవత్సరంలోకి ప్రపంచం మొత్తం అడుగు పెట్టబోతోంది. సంవత్సరంలో మొదటి రోజైనా జనవరి ఫస్ట్‌ను ప్రపంచమంతా ఎంతో గ్రాండ్‌గా సెలెబ్రేట్ చేసుకుంటారు. అయితే టాలీవుడ్ అగ్రతార చల్ అగర్వాల్ ఈసారి ఇండియాలో కాకుండా తైవాన్ రాజధాని తైపీ సిటీలో సెలబ్రేట్ చేయాలని నిర్ణయించుకుంది. ఆల్రెడీ అక్కడికి వెళ్లిన ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం తైపీలో తన భర్త గౌతమ్‌ కిచ్లుతో కలిసి వెకేషన్‌ను బాగా ఎంజాయ్ చేస్తోంది. ఈ ప్రాంతంలో ఒక హోటల్‌లో తన భర్త కొడుకు నీల్, స్నేహితులతో కలిసి కాజల్ స్టే చేస్తుంది.

అక్కడ తాను ఎంజాయ్ చేస్తున్న మూమెంట్స్‌ని కెమెరాల్లో బంధించి అభిమానులకు కూడా షేర్ చేస్తూ అలరిస్తోంది. అయితే కాజల్ షేర్ చేసిన ఒక ఫొటోల్లో ఓ ఫొటో వైరల్ గా మారింది. ఇందులో గౌతమ్‌ కాజల్‌కి బ్యాక్ సైడ్ నుంచి ముద్దు పెట్టుకోబోయాడు. దానిని అది కనిపెట్టింది. దాంతో రొమాంటిక్ గా చిలిపిగా దొంగతనం గా కిస్ పెట్టుకుందామనుకున్న గౌతమ్ ప్లాన్ రివర్స్ అయ్యింది. అప్పుడు దీనిని కవర్ చేసుకోవడానికి అతడు చిన్న స్మైల్ ఇచ్చాడు. ఈ రెండు బ్యూటిఫుల్ మూమెంట్స్‌ను ఫోటోల్లో బంధించగా.. వాటిని కాజల్‌ ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా షేర్ చేసుకుంది.

వీటిని చూసిన నెటిజన్లు గౌతమ్‌ చూడ్డానికి ఇన్నోసెంట్‌గా ఉన్నా బాగా రొమాంటిక్ అంటూ కామెంట్లు చేస్తున్నారు. సెకండ్ చైల్డ్ కోసం అప్పుడే ప్లానింగ్స్‌ హా?? అంటూ మరికొందరు ఫన్నీగా వ్యాఖ్యానిస్తున్నారు. ఇదిలా ఉండగా, ప్రస్తుతానికి `ఇండియన్ 2` సినిమాలో కాజల్ నటిస్తోంది. కమర్షియల్‌ యాడ్స్‌ కూడా చేస్తోంది. కొత్తగా ఏ సినిమాని ఇంకా ప్రకటించలేదు.