ప్రముఖ స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ బాలీవుడ్ నటుడు, నిర్మాత జాకీ భగ్నానీతో పీకల్లోతు ప్రేమలో ఉన్న సంగతి తెలిసిందే. గత ఏడాది తన ప్రేమ విషయాన్ని బహిర్గతం చేసిన రకుల్.. షూటింగ్స్ నుండి గ్యాప్ దొరికినప్పుడల్లా ప్రియుడితో ఫుల్ ఎంజాయ్ చేస్తోంది. తరచూ వెకేషన్స్, పార్టీలకు వెళ్తూ వార్తలు నిలుస్తున్నారు.
ఇక ఈ జంట వచ్చే ఏడాది పెళ్లి పీటలెక్కబోతోందంటూ నెట్టింట జోరుగా ప్రచారం జరుగుతోంది. ఇలాంటి తరుణంలో రకుల్ పెళ్లి వేడుకల్లో దర్శనమిచ్చి షాక్ ఇచ్చింది. అయితే తన పెళ్లి కాదులేండి.. తన ఫ్రెండ్ పెళ్లి వేడుకల్లో రకుల్ తాజాగా సందడి చేసింది. ఈ సందర్భంగా లెహంగా చోళీలో అందంగా ముస్తాబై ఫోటోలకు పోజులిచ్చింది. ఇందుకు సంబంధించిన పిక్స్ ను ఇన్‌స్టాలో పంచుకున్న రకుల్.. `వింటర్ సన్ అండ్ వెడ్డింగ్ సీజన్` అని క్యాప్షన్ పెట్టింది.
దీంతో `నీ పెళ్లెప్పుడు రకుల్..?` అంటూ నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. కాగా, సినిమాల విషయానికి వస్తే.. బాలీవుడ్ లో పాగా వేయాలని ప్రయత్నిస్తున్న రకుల్ ఈ ఒక్క ఏడాది ఐదు చిత్రాలతో నార్త్ ప్రేక్షకులను పలకరించింది. కానీ, ఈ సినిమాలన్నీ వరసగా పరాజయం పాలయ్యాయి. ప్రస్తుతం బాలీవుడ్ లో రెండు, మూడు సినిమాలకు సైన్ చేసింది. అలాగే తమిళంలో కమల్ హాసన్ హీరోగా తెరకెక్కుతున్న `ఇండియన్ 2`లో నటిస్తోంది. తెలుగులో మాత్రం ఈ బ్యూటీ ఎలాంటి సినిమాలకు ఒప్పుకోలేదు.
https://www.instagram.com/p/Cms5EOsvyVI/?utm_source=ig_web_copy_link