ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ ఆహాలో ప్రసారమయ్యే అన్‌స్టాపబుల్ షో సెకండ్ సీజన్ సూపర్ హిట్ అయింది. ఈ షోని బాలకృష్ణ హోస్ట్ చేస్తున్న విషయం తెలిసిందే. ప్రతి శుక్రవారం వచ్చే ఈ షోలో సినీ సెలబ్రిటీలు గెస్టులు వచ్చి బాలయ్య బాబుతో ఎన్నో విషయాలు గురించి ముచ్చటిస్తున్నారు. అయితే ఈసారి అన్‌స్టాపాబుల్ షోకి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రానున్నట్లు సమాచారం. ఒకవైపు రాజకీయాలు, ఇంకోవైపు సినిమాలతో బిజీగా ఉన్న పవన్ కళ్యాణ్ బాలకృష్ణ షో కోసం కొన్ని గంటల సమయాన్ని కేటాయించాడని టాక్.
ఈ ఎపిసోడ్‌కి సంబంధించిన షూటింగ్ ఇప్పటికే పూర్తవడంతో ప్రస్తుతం ఒక్కోటిగా ఆసక్తికరమైన విషయాలు బయటకు వస్తున్నాయి. ఈ షో వేదికగా బాలయ్య, పవన్ల మధ్య సినిమాలు, రాజకీయాలు, వ్యక్తిగత అంశాల గురించి చర్చలు జరిగాయట. అయితే అందరూ ఊహించినట్లే పవన్ కళ్యాణ్ మూడు పెళ్లిళ్ల విషయం గురించి బాలకృష్ణ అడిగినట్లు తెలుస్తుంది. “ప్రత్యర్థులు మీ పెళ్లిళ్ల గురించి విమర్శిస్తూ ఉంటారు. అసలు మూడు పెళ్లిళ్లు ఎందుకు చేసుకున్నారు? దానికి కారణం ఏమిటి?” అని బాలయ్య పవన్ ని ప్రశ్నించారట.
అయితే పవన్ మాత్రం గతంలో చెప్పిన ఆన్సర్‌నే మళ్ళీ రిపీట్ చేసినట్లు తెలుస్తుంది. ‘నేను నా సరదా కోసం మూడు పెళ్లిళ్లు చేసుకోలేదు. జీవిత భాగస్వామితో విబేధాలు తలెత్తినప్పుడు చట్టపరంగ విడాకులు తీసుకొని ఇంకో పెళ్లి చేసుకోవాల్సిన వచ్చింది’ అని పవన్ సమాధానం చెప్పారట. ఇక ఆ విషయంలో బాలయ్య పవన్‌కి మద్దతుగా నిలిచారని సమాచారం. ఈ మూడు పెళ్లిళ్ల విషయంలో పవన్‌ని విమర్శించే వారికి బాలయ్య స్ట్రాంగ్‌గా కౌంటర్ ఇచ్చినట్లు ఇచ్చినట్లు తెలుస్తుంది.
ఇలాంటి విమర్శలు చేసేముందు ఎవరి కుటుంబాల గురించి వారు చూసుకోవాలని బాలయ్య అన్నారట. ఈ షోకి హాజరైన ప్రేక్షకులు ఈ విషయాల గురించి సమాచారం అందిస్తున్నారు. త్వరలోనే ఈ ఎపిసోడ్ ప్రసారం కానుంది కాబట్టి దీని కోసం అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.