లోకేష్ ‘యువగళం’: వైసీపీ అడ్డుకుంటుందా?

మొత్తానికి నారా లోకేష్ పాదయాత్ర చేయడానికి రెడీ అయిన విషయం తెలిసిందే..మళ్ళీ తెలుగుదేశం పార్టీని అధికారంలోకి తీసుకురావడమే లక్ష్యంగా ఇప్పటికే చంద్రబాబు కష్టపడుతున్న విషయం తెలిసిందే. ఇక ఆయనకు తోడుగా లోకేష్ సైతం పాదయాత్రకు రెడీ అయ్యారు. 2023 జనవరి 27 నుంచి లోకేష్ పాదయాత్ర మొదలుకానుంది. 400 రోజులు 4 వేల కిలోమీటర్లు..100 నియోజకవర్గాల్లో లోకేష్ పాదయాత్ర కొనసాగనుంది. కుప్పం టూ ఇచ్చాపురం పాదయాత్ర కొనసాగనుంది.

అయితే లోకేష్ పాదయాత్రకు తాజాగా యువగళం అని పేరు పెట్టారు. ఇక యువగళం పేరుపై రకరకాల చర్చలు నడుస్తున్నాయి..లోకేష్ పాదయాత్ర్రలో అన్నీ వర్గాలని కలుస్తారు కదా..మరి యువగళం ఏంటి అని అందరికీ డౌట్ వచ్చింది. దీనికి టీడీపీ శ్రేణులు వేరే అర్ధం చెబుతున్నారు. లోకేష్ యువకుడు కాబట్టి..ఆయన ప్రజల తరుపున గళం వినిపిస్తారని, అందుకే యువగళం పేరు పెట్టారని అంటున్నారు. ఇక పేరు ఏదైనా గాని..ఆయన పాదయాత్ర త్వరలోనే మొదలవుతుంది.

కానీ లోకేష్ పాదయాత్రకు వైసీపీ అడ్డంకులు సృష్టించే అవకాశాలు ఉన్నాయని టీడీపీ శ్రేణులు భావిస్తున్నాయి. ఎందుకంటే ఇప్పటికే చాలా సందర్భాల్లో టీడీపీ కార్యక్రమాలని ఏదో రకంగా అడ్డుకుంటూ వచ్చారు. అలాగే మాచర్ల, గుడివాడ లాంటి చోట్ల టీడీపీకి పోటీగా వైసీపీ వాళ్ళు వచ్చి అడ్డుకునే ప్రయత్నాలు చేయడంతో గొడవలు కూడా జరిగాయి. ఇదే సమయంలో తాజాగా మంత్రి మేరుగు నాగార్జున సైతం లోకేష్ పాదయాత్రని అడ్డుకుంటామని, దళితులకు టీడీపీ ఏం చేసిందో చెప్పి పాదయాత్ర చేయాలని అంటున్నారు.

అసలు లోకేష్ పాదయాత్ర కాదు కదా..పాకుడు యాత్ర చేసిన ప్రజలు నమ్మరని అంటున్నారు. జగన్‌కే జనం మద్ధతు ఉందని చెబుతున్నారు. అయితే గతంలో టీడీపీ అధికారంలో ఉండగా, జగన్ పాదయాత్రకు ఎలాంటి ఇబ్బందులు రాలేదు. మరి ఇప్పుడు లోకేష్ పాదయాత్రకు వైసీపీ బ్రేకులు వేస్తుందేమో చూడాలి.