తండ్రి వ‌య‌సున్న చిరు, బాల‌య్య‌తో రొమాన్స్ అవ‌స‌ర‌మా? శ్రుతి హాస‌న్ దిమ్మ‌తిరిగే రిప్లై!

అందాల భామ శ్రుతిహాసన్ వచ్చే ఏడాది సంక్రాంతికి రెండు సినిమాలతో ప్రేక్షకులను పలకరించబోతోంది. అందులో మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కిన `వాల్తేరు వీరయ్య` ఒకటి కాగా.. నట‌సింహం నందమూరి బాలకృష్ణ నటించిన `వీర సింహారెడ్డి` మరొకటి. ఈ రెండు చిత్రాలు మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పైనే నిర్మితం అయ్యాయి.

ఒక్కరోజు వ్య‌వ‌ధిలో ఈ రెండు సినిమాలు ప్రేక్షకులు ముందుకు రాబోతున్నాయి. అయితే ఆరుపదుల వయసున్న చిరు బాలయ్యతో శ్రుతిహాసన్ నటించిన పై కొందరు సోషల్ మీడియా వేదిక ఎప్ప‌టి నుంచో విమర్శలు గుప్పిస్తున్నారు. తండ్రి వయసున్న హీరోలతో రొమాన్స్ అవసరమా అంటూ కామెంట్లు చేస్తున్నారు.

అయితే ఈ విషయంపై శ్రుతిహాసన్ తాజాగా స్పందిస్తూ దిమ్మతిరిగే రిప్లై ఇచ్చింది. `ఈ మధ్యకాలంలో చాలామంది స్టార్ నటీనటులకు సంబంధించిన వయసు గురించి మాట్లాడుతున్నారు.. వయసు అనేది కేవలం ఒక నెంబర్ మాత్రమే.. న‌ట‌న‌కు వ‌య‌సుతో సంబంధం లేదు` అని శ్రుతి హాస‌న్ పేర్కొంది. సినిమాల్లో నటించడానికి వయసును చూడకూడద‌ని శ్రుతి హాస‌న్ స్ప‌ష్టం చేసింది. అలాగే ఏ వయసులో ఉండాల్సిన అందం ఆ వయసులో ఉంటుంద‌ని కూడా శ్రుతి హాస‌న్ చెప్పుకొచ్చింది.