ఐకాన్ స్టార్ అల్లుఅర్జున్ హీరోగా టాలీవుడ్ క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ తెరకెక్కించిన పుష్ప సినిమా ఎంతటి ఘాన విజయం సాధించిందో మనందరికీ తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా సీక్వెల్ కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే ఈ పుష్ప సీక్వల్ షూటింగ్ కూడా మొదలుపెట్టారు. ఇప్పుడు ఈ సినిమా నుంచి ఒక క్రేజీ అప్డేట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
పుష్ప పార్ట్ 2 ను నిర్మాతలు ఎంతో ప్రతిష్టాత్మకంగా మొదటి పార్ట్ కన్నా ఎంతో కొత్తగా 350 కోట్ల భారీ బడ్జెట్ తో ఎంతో గ్రాండ్గా నిర్మిస్తున్నారు. ఈ క్రమంలోనే ఈ సినిమా స్క్రిప్ట్ లో కూడా దర్శకుడు ఎన్నో మార్పులు చేశారని కూడా తెలుస్తుంది. మొదటి పార్ట్ లో ఉన్న పాత్రల కన్నా రెండో పార్ట్ లో కొత్త పాత్రలు కూడా వస్తాయని సమాచారం. ఇక ఇందుకోసం ఆ పాత్రలకు సంబంధించిన నటీనటుల వేటలో చిత్రయూనిట్ ఉంది. ఇక అందులో ఓ పాత్ర కోసం బాలీవుడ్ బడా నటుడు పేరు పరిశీలిస్తున్నారు.
గత కొన్ని రోజులుగా ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ హీరో అర్జున్ కపూర్ నటిస్తున్నారని కూడా ప్రచారం జరిగింది. ఇక వార్తల్లో ఎటువంటి నిజం లేదని సినిమా యూనిట్ కొట్టేసింది. ఇప్పుడు మళ్లీ అదే తరహా మరో ఇంట్రెస్టింగ్ అప్డేట్ బయటికి వచ్చింది. ఇక ఈసారి ఈ సినిమాలో బాలీవుడ్ లో వచ్చిన టైగర్ జిందా హై సినిమాలో విలన్ గా నటించిన సజ్జాద్ డెలాఫ్రూజ్ పుష్ప 2 లో నటిస్తున్నాడని సోషల్ మీడియాలో టాక్ నడుస్తుంది.
ప్రస్తుతం ఈ సినిమా యూనిట్ పుష్ప సినిమాను ఈనెల 8న రష్యాలో విడుదల చేయనున్నారు. ఈ సినిమా ప్రమోషన్స్ కోసం రష్యాలో చిత్ర యూనిట్ సందడి చేస్తుంది. అక్కడినుండి వచ్చిన వెంటనే పుష్ప పార్ట్ 2 కి సంబంధించి ఏదో ఒక అప్డేట్ బయటకు వస్తుందని సమాచారం.