టాలీవుడ్ యంగ్ అండ్ ప్రామిసింగ్ హీరో అడివి శేష్ హీరో నటించిన లేటెస్ట్ సస్పెన్స్ థ్రిల్లర్ హిట్ 2. హిట్ సినిమాకు సీక్వెల్గా వచ్చిన హిట్ 2 సినిమాను యంగ్ అండ్ టాలెంటెడ్ దర్శకుడు శైలేష్ కొలను తెరకెక్కించాడు. మీనాక్షి చౌదరి ఈ సినిమాలో హీరోయిన్గా నటించింది. ఇప్పటికే ప్రేక్షకుల నుంచి ఈ సినిమాకు సూపర్ థ్రిల్లర్ అన్న టాక్ అయితే వచ్చేసింది.
ఇక ఫస్ట్ డే ఎలాంటి పోటీ లేకపోవడంతో హిట్ 2 జోరుకు బాక్సాఫీస్ దగ్గర అడ్డేలేదు. ఇక వరల్డ్ వైడ్ గా శేష్ కెరీర్ లో హిట్ 2 మరో సాలిడ్ ఓపెనింగ్స్ అందుకుంది. ఈ సినిమాతో శేష్ వరుగా ఆరో హిట్ తన ఖాతాలో వేసుకోవడంతో పాటు డబుల్ హ్యాట్రిక్ హిట్లు కొట్టి ఎన్టీఆర్ సరసన చేరాడు. ఎన్టీఆర్ కూడా ఇటీవల కాలంలో వరుసగా ఆరు హిట్లు కొట్టిన సంగతి తెలిసిందే.
ఇక హిట్ 2 నిర్మాతలు అధికారికంగా అనౌన్స్ చేసిన దాని ప్రకారం ఈ సినిమా ఫస్ట్ డే వరల్డ్ వైడ్ 11.27 కోట్ల గ్రాస్ వసూలు చేసి అదరగొట్టింది. ఈ వసూళ్లతో కూడా అడివి శేష్ తన కెరీర్ లో బెస్ట్ వసూళ్లు సాధించడంతో చాలా హ్యాపీ ఫీలవుతున్నాడు. లాంగ్ రన్లో ఈ సినిమా ఈజీగా రు. 50 కోట్లకు పైగా వసూళ్లు సాధించనుంది.