బాలీవుడ్ హీరోయిన్ కియరా అద్వాని తన టాలెంట్ తోనే వరుస అవకాశాలను అందుకుంటూ ఉంటోంది. మొదట్లో పలు సినిమాలలో సెకండ్ హీరోయిన్గా నటించిన ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం స్టార్ హీరోయిన్గా క్రేజ్ అందుకుంది.బాలీవుడ్ తో పాటు టాలీవుడ్ లో కూడా పలు సినిమాలు చేస్తు మంచి పాపులారిటీ సంపాదించుకుంది. మొదట టాలీవుడ్లోకి మహేష్ బాబుతో భరత్ అనే నేను చిత్రంలో నటించి మంచి విజయాన్ని అందుకుంది. అటు తరువాత రామ్ చరణ్ తో వినయ విధేయ రామ సినిమాలో నటించిన పెద్దగా సక్సెస్ కాలేక పోయింది.
ఇప్పుడు మరొకసారి రాంచరణ్ తో RC -15 సినిమాలలో నటించబోతోంది.ఈ చిత్రానికి డైరెక్టర్ శంకర్ దర్శకత్వం వహిస్తూ ఉన్నారు. ఈ సినిమా పాన్ ఇండియా సినిమాగా విడుదల కాబోతోంది. సినిమాలతో పాటు సోషల్ మీడియాలో కూడా తన ఫ్యాన్స్ అలరిస్తూ ఉంటుంది కీయరా.గడిచిన కొద్దిరోజుల క్రితం నుంచి ఒక గుడ్ న్యూస్ చెబుతానని తెలియజేస్తూ ఉండేది. తను చెప్పబోయే గుడ్ న్యూస్ సిద్ధార్థ మల్హోత్రాలతో మ్యారేజ్ అని అందరూ అనుకున్నారు.. కానీ అందరి అంచనాలను ఒక్కసారిగా తలకిందులు చేస్తూ కీయరా షాక్ ఇచ్చింది.
ఇక తను చెప్పిన విషయం ఏమిటంటే ఒక బ్రాండ్ గురించి తెలియజేసింది.. ఈమధ్య బాలీవుడ్ హీరోయిన్లతో సొంతగా ఒక బ్యూటీ అండ్ వెల్నెస్ ప్రోడక్ట్ మీద ఎక్కువ మక్కువ చూపుతున్నారు. అలాంటి బ్రాండ్లకు ప్రకటనలు చేసి మీరు ఎప్పుడు అలాంటి బ్రాండ్లను సొంతంగా ఏర్పాటు చేయడం జరుగుతుంది. కియారా అద్వాని కూడా సొంతగా కిమిరికా అనే ఒక కొత్త బిల్ నెస్ ప్రోడక్ట్ ని మొదలు పెట్టబోతోంది. ఇక ఈ బ్రాండ్ కి కీయరా పెరు కిమీరికా వచ్చేలాగా.. బ్రాండ్ పేరు పెట్టుకోవడం జరిగింది. ప్రస్తుతం ఈ విషయం వైరల్ గా మారుతోంది.