నందమూరి బాలకృష్ణ అన్ స్టాపబుల్ షో తో తనలోని కొత్త వ్యక్తిని బయటకు పరిచయం చేశాడు. బాలయ్య ఈ షోలో పైకి నవ్వుతూ కనిపిస్తూ లోపల మామూలోడు కాదు అనేలా ఆ షోలో బాలయ్య హోస్టింగ్ చూస్తుంటే అందరికీ ఇదే అనిపిస్తుంది. తను నవ్వుతూనే అక్కడికి వచ్చిన వారిని అడగాల్సినవన్నీ అడిగేస్తున్నారు. ఇక తాజాగా నిన్న స్ట్రీమింగ్ అయిన ఎపిసోడ్ లో టాలీవుడ్ లో ఉన్న నలుగురు లెజెండ్స్ వచ్చారు. సురేష్ బాబు, అల్లు అరవింద్, రాఘవేందర్రావు, కోదండరామిరెడ్డి.
ఈ నలుగురితో బాలయ్య అదిరిపోయే కామెడీ చేశాడు. ఇక నలుగురిలో అల్లు అరవింద్, సురేష్ బాబు టాలీవుడ్ లోనే అగ్ర నిర్మాతలు అవడంతో వాళ్ళిద్దర్నీ ఇరకాటంలో పెట్టే క్వశ్చన్లతో ఉక్కిరిబిక్కిరి చేశాడు. బాలకృష్ణ గురించి చెప్పాలంటే.. ఇప్పుడు నుంచీ అన్ స్టాపబుల్ ముందు.. తర్వాత అని చెప్పాలేమో.. ఎందుకంటే ఆయన అంత సరదాగా ఉంటారు ఆయనలో ఇంత మంచి వ్యాఖ్యాత ఉన్నారనే విషయం ఈ షో ద్వారానే బయటకు వచ్చింది.
ఈ షోలో బాలకృష్ణను చూసి అభిమానులకు కూడా మన బాలకృష్ణ నేనా అనే విధంగా షాక్ అవుతున్నారు. ప్రధానంగా ఆయన వేసే ప్రశ్నల విషయంలో కూడా ఎటువంటి మొహమాటం లేకుండా.. వచ్చిన అతిధుల తో ఆన్సర్ రాబడుతున్నాడు. ఇప్పటికీ ఈ సీజన్ తొలి ఎపిసోడ్ నారా చంద్రబాబు , లోకేష్ తో చేసిన మొదటి ఎపిసోడ్ ఎంతో వైరల్ గా మారింది. అందులో కూడా బాలకృష్ణ తాను అడగాల్సిన ప్రశ్నలను ముక్కు సూటిగా అడిగారు. అందులో ఎన్టీఆర్ వెన్నుపోటు, రాజకీయాల నుంచి ఫ్యామిలీ లైఫ్ సంబంధించిన ప్రశ్నలతో చంద్రబాబును ఉక్కిరి బిక్కిరి చేశాడు.
ఇక రీసెంట్గా కిరణకుమార్ రెడ్డితో జరిగిన ఎపిసోడ్ లో కూడా ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర విభజన సమయంలో జరిగిన పరిస్థితులను డిస్కషన్ చేశారు. తాజాగా నిన్న వచ్చిన ఎపిసోడ్ లో అల్లు అరవింద్, సురేష్ బాబును టాలీవుడ్లో ఉన్న ఆ నలుగురు పెద్దలు మీరేనా అంటూ ఇరకాటంలో పడేశారు బాలకృష్ణ. తన నవ్వుతూనే అడగాల్సిన వన్నీ అడిగేసి దాంతో పాటు సంక్రాంతికి నాకు ఎన్ని థియేటర్లు ఇస్తారు అంటూ అల్లు అరవింద్ ను అడిగి.. ఇవే కాకుండా చిరంజీవితో కలిసి మల్టీస్టారర్ సినిమామా చేస్తే అది పాన్ ఓల్డ్ సినిమా అవుతుందని చెబుతూ తనలోని కొత్త బాలయ్యను ప్రేక్షకులకు పరిచయం చేశాడు.