బాలయ్యతో సినిమా.. ఎట్టకేలకు అఫిషియల్‌గా చెప్పేసిన హాట్ బ్యూటీ..!

నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం గోపీచంద్ మలినేని దర్శకత్వంలో వస్తున్న వీర సింహారెడ్డి షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. ఈ సినిమా షూటింగ్‌ను ఈ నెల రెండో వారంలోపు పూర్తిచేయాలని ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమాను వచ్చే సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు తీసుకురామన్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి వచ్చిన టీజర్, ఫస్ట్ లుక్, ఫస్ట్ సాంగ్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. గోపీచంద్ ఈ సినిమాను బాలకృష్ణ ఇమేజ్‌కు తగ్గట్టు పక్క మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిస్తున్నాడు.

అయితే ఈ సినిమా తర్వాత బాలకృష్ణ స్టార్ దర్శకుడు అనిల్ రావిపూడి సినిమాలో బిజీ అవ్వనున్నాడు. ఈ సినిమా షూటింగ్ ని కూడా ఈ నెల 8వ తేదీ నుంచి మొదలు పెట్టనున్నారు అని తెలుస్తుంది. ఈ సినిమా షూటింగ్ కోసం హైదరాబాద్‌లో భారీ జైల్ సెట్ ను కూడా నిర్మించారు. తాజాగా ఇప్పుడు ఈ సినిమాకు సంబంధించి ఓ ఇంట్రెస్టింగ్ అప్డేట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Buzz: Balakrishna's NBK108 to launch on December 8; Sonakshi Sinha, Arjun  Rampal to join cast | PINKVILLA

ఈ సినిమాలో బాలకృష్ణకు జోడిగా బాలీవుడ్ బ్యూటీ సోనాక్షి సిన్హా నటిస్తున్నట్లు తెలుస్తుంది. ఇప్పటికే NBK 108 సినిమా యూనిట్ సోనాక్షి సిన్హాను సంప్రదించినట్టుగా.. ఆమె కూడా ఈ సినిమాలో నటించేందుకు ఓకే చెప్పినట్టు తెలుస్తుంది. అయితే ఇప్పుడు ఈ వార్తల పై బాలీవుడ్ బ్యూటీ సోనాక్షి తాన‌ సోషల్ మీడియా ద్వారా స్పందించింది.

Sonakshi Sinha: బాలయ్య మూవీలో సోనాక్షి సిన్హా నటిస్తున్నారంటూ రూమర్స్..  క్లారిటీ ఇచ్చిన బాలీవుడ్ బ్యూటీ..!

ఈ వార్తలపై అదిరిపోయే క్లారిటీ ఇచ్చింది. తాను తెలుగు సినిమాలో న‌టిస్తున్నాన‌ని వస్తున్న వార్తల్లో నిజం లేదని.. ఆ సినిమా నుంచి నన్ను తప్పించినట్టు వస్తున్న వార్తల్లో కూడా నిజం లేదని ఆమె తన సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. దీంతో సోనాక్షి- బాలయ్య సినిమాలో నటిస్తుంది అన్న వార్తల్లో నిజం లేదని తేలిపోయింది.