బాలీవుడ్ హాట్ బ్యూటీ ఊర్వశి రౌతేలా టీమ్ ఇండియా స్టార్ క్రికెటర్ రిషబ్ పంత్ వీరిద్దరూ పీకల్లోతు ప్రేమలో ఉన్నట్టు సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది. ఈ విషయంపై వారు అధికారకంగా స్పందించక పోయిన సోషల్ మీడియాలో మాత్రం తెగ వైరల్ గా మారింది. అయితే గత కొన్ని రోజుల నుండి వీరిద్దరి మధ్య పచ్చగడ్డి వేస్తే బొగ్గు మనే విధంగా మనస్పర్ధలు వచ్చినట్టు తెలుస్తుంది.
సోషల్ మీడియాలో ఒకరి పోస్టులకు మరొకరు కౌంటర్లు ఇచ్చుకుంటున్నారు. రిషబ్ పంత్ సోషల్ మీడియాలో ఊర్వశిని బ్లాక్ చేయడం.. ఇక తర్వాత ఊర్వశి పదే పదే రిషబ్ పోస్టుకు వ్యతిరేకంగా పోస్టులు పెట్టడం చేసింది. ఈ విషయంతో ఊర్వశి కి కావాల్సినంత పబ్లిసిటీ వచ్చింది. దాంతో బాలీవుడ్ తో పాటు పలు ఇతర భాషల సినిమాల్లో కూడా ఈ ముద్దుగుమ్మకు అవకాశాలు వస్తున్నాయి.
రీసెంట్ గా ఈ ముద్దుగుమ్మ మిస్టర్ ఆర్ పీ అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఆ పోస్ట్ చాలామంది రిషబ్ పంత్ గురించి చేసిందంటూ సోషల్ మీడియాలో కామెంట్ చేశారు. కానీ ఈమె ఆ పోస్ట్ పై స్పందిస్తూ నేను ఆర్ పీ అంటూ పోస్ట్ చేసింది టాలీవుడ్ యంగ్ హీరో రామ్ పోతినేని గురించి అతడు నా సహనటుడు. నాకు ఇప్పుడే తెలిసిందని చెప్పింది.
ఆర్ పీ అంటే రిషబ్ పంత్‌ను కూడా అంటారా.. రిషబ్ పంత్‌ను ఆర్ పీ అంటారని నాకు తెలియదు. తెలియక నేను ఆ విధంగా పోస్ట్ పెట్టాను. నేను మాత్రం రామ్ పోతినేని ఉద్దేశించి ఆ పోస్ట్ పెట్టాను అంటూ ఊర్వశి క్లారిటీ ఇచ్చింది. ఇప్పుడు రిషబ్ పంత్ ఊర్వశి రచ్చ లోకి టాలీవుడ్ హీరో రామ్ కూడా వచ్చి ఇరుక్కున్నాడు. రామ్ ఈ వ్యవహారంపై ఏ విధంగా స్పందిస్తాడో చూడాలి.