పెళ్లి చూపుల సినిమాతో టాలీవుడ్లో హీరోగా పరిచయమైన విజయ్ తర్వాత అర్జున్ రెడ్డి సినిమాతో స్టార్ హీరో ఇమేజ్ తెచ్చుకున్నాడు. తర్వాత గీత గోవిందం వంటి సూపర్ హిట్ సినిమా చేసి తెలుగు చిత్ర పరిశ్రమలో స్టార్ హీరోగా సెటిల్ అయ్యాడు.ఈ సినిమా తర్వాత విజయ్ దేవరకొండ తన ఇమేజ్‌కు తాగా హీట్ అందుకోలేకపోయాడు. విజయ్ ఎన్నో ఆశలు పెట్టుకుని పూరి జగన్నాథ్ దర్శకత్వంలో పాన్ ఇండియా వైడ్‌గా నటించిన సినిమా లైగర్. ఈ సినిమా విజయ్ దేవరకొండ కెరియర్ లేన అత్యంత చెత్త సినిమాగా మిగిలిపోయింది. ఈ సినిమా తర్వాత విజయ్ దేవరకొండ కెరియర్ డౌన్ ఫాల్ అయిందని చెప్పవచ్చు.
ప్రస్తుతం విజయ్- శివనిర్మాణ దర్శకత్వంలో సమంతకు జోడిగా ‘ఖుషి సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమా తర్వాత విజయ్ సుకుమార్‌లో ఓ సినిమా చేయబోతున్నాడని టాలీవుడ్ వర్గాల్లో టాక్ నడుస్తుంది. ఈ సినిమాను తెలుగు చిత్ర పరిశ్రమలో ఉన్న ఓ అగ్ర నిర్మాణ సంస్థ నిర్మించబోతుందని కూడా తెలుస్తుంది. అయితే ఇప్పుడు ఇంకో ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఒకటి బయటకు వచ్చింది. సుకుమార్ ప్రస్తుతం అల్లు అర్జున్ తో పుష్ప పార్ట్ 2 సినిమా షూటింగ్లో బిజీగా ఉన్నాడు.. ఈ సినిమా షూటింగ్ ఎలాగైనా తొమ్మిది నెలల్లో పూర్తి చేసి ఇండియాతో పాటు చైనా- జపాన్ లో ఒకేసారి విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నాడు.
ఇక ఈ సినిమా పూర్తి అయిన తర్వాత రామ్‌చరణ్ తో సినిమా చేయాలని సుకుమార్ ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తుంది. రామ్ చరణ్ కూడా జెర్సీ దర్శకుడు తో ఏనౌన్స్ చేసిన సినిమా కూడా ఆగిపోయింది.. అయితే రామ్ చరణ్- సుకుమార్‌తో సినిమాా చేయాలని భావిస్తున్నట్టు తెలిసింది.. మరోసారి రంగస్థలం లాంటి హిట్ కొట్టాలని ఇద్దరు ఫిక్స్ అయినట్టు తెలుస్తుంది. విజయ్ దేవరకొండ సుకుమార్ తో చేయాల్సిన ప్రాజెక్ట్ మధ్యలోనే ఆగిపోయిందని టాలీవుడ్ సర్కిల్లో ఒక వార్త హల్చల్ గా మారింది. ఈ విషయంపై త్వరలోనే అధికార ప్రకటన రానుందని తెలుస్తుంది.