ప్రగ్యా జైస్వాల్.. ఈ అందాల భామ గురించి ప్రత్యేకమైన పరిచయాలు అవసరం లేదు. `డేగ` అనే ద్విభాష చిత్రంతో టాలీవుడ్ లోకి అడుగు పెట్టిన ప్రగ్యా జైస్వాల్..`కంచె` సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గర అయింది. ఆ తర్వాత వరుస పెట్టి సినిమాలు చేసింది. కానీ, సక్సెస్ ను మాత్రం తన వశం చేసుకోలేకపోయింది.
ఇక కెరీర్ క్లోజ్ అనుకుంటున్న సమయంలో ఈ అమ్మడు నటసింహం నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబోలో తెరకెక్కిన `అఖండ` చిత్రంలో అవకాశాన్ని అందుకుంది. గత ఏడాది విడుదలైన ఈ చిత్రం సంచలన విజయాన్ని నమోదు చేసింది. ఈ సినిమాతో అయినా ప్రగ్యా దశ తిరుగుతుందని అందరూ భావించారు.
కానీ అఖండ వంటి బ్లాక్ బస్టర్ హిట్ పడినా ప్రగ్యాకు ఆఫర్లు కరువయ్యాయి. ప్రస్తుతం ఈ భామ సోషల్ మీడియా వేదికగా గ్లామర్ షో తో ఆకట్టుకునే ప్రయత్నం చేస్తుంది. అయితే అందాల కంచెలు ఎంత తెంచుతున్న ప్రగ్యాకు ఏమాత్రం కలిసి రావడం లేదు.
ఇకపోతే తాజాగా మరోసారి స్కిన్ షో తో కుర్రకారుకు మంచి ట్రీట్ ఇచ్చింది. బ్రౌన్ కలర్ ట్రెండీ దుస్తులను ధరించిన ప్రగ్యా.. ఎద అందాలను దగ్గరగా చూపిస్తూ హాట్ హాట్ గా ఫోటోలకు పోజులిచ్చింది. ప్రస్తుతం ఈ పిక్స్ నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.