కేసీఆర్ ‘బీఆర్ఎస్’..వైసీపీ ముందుమాట..!

తెలంగాణ సీఎం కేసీఆర్…టీఆర్ఎస్ పార్టీని కాస్త బీఆర్ఎస్ మార్చిన విషయం తెలిసిందే. ఇప్పటివరకు తెలంగాణ రాష్ట్ర సమితితో రాజకీయం నడిపిన కేసీఆర్..ఇకపై జాతీయ రాజకీయాల్లో కీలకపాత్ర పోషిచాలని చెప్పి..టీఆర్ఎస్ పార్టీని జాతీయ పార్టీకి మార్చే క్రమంలో భారత్ రాష్ట్ర సమితిగా మార్చారు. ఇక బీఆర్ఎస్‌తో అన్నీ రాష్ట్రాల్లో రాజకీయం చేయనున్నారు. ముఖ్యంగా ఏపీపై కూడా కేసీఆర్ ఎక్కువ ఫోకస్ చేయనున్నారు.

ఇప్పటికే ఏపీలో టీడీపీని టార్గెట్ చేశారని పెద్ద ఎత్తున కథనాలు వచ్చిన విషయం తెలిసిందే. టీడీపీలో రాజకీయంగా రిటైర్మెంట్‌గా దగ్గరైన నేతలు, సీటు దొరకని నేతలని బీఆర్ఎస్‌లోకి తీసుకురావాలని కేసీఆర్ చూస్తున్నారని ప్రచారం జరుగుతుంది. అలాగే తాజాగా బీఆర్ఎస్ ఆవిర్భావం అప్పుడు ఏపీలో కొందరు కేసీఆర్‌ పార్టీకి స్వాగతం చెబుతూ బ్యానర్లు కూడా కట్టారు. మొత్తానికి ఏపీలో కీలకంగా ఉండాలని కేసీఆర్ స్కెచ్ వేస్తున్నట్లు తెలుస్తోంది.

 

అయితే కేసీఆర్ పార్టీపై టీడీపీ నుంచి పెద్దగా స్పందన రాలేదు. టీడీపీ అధినేత చంద్రబాబు..మీడియా కేసీఆర్ పార్టీ గురించి అడిగితే ఒక నవ్వు నవ్వి వదిలేశారు. మిగతా టీడీపీ నేతలు కూడా పెద్దగా స్పందించలేదు. కానీ వైసీపీ నేతలు మాత్రం వరుసపెట్టి స్పందిస్తున్నారు. ఏపీ మంత్రులు..బీఆర్ఎస్‌పై స్పందిస్తూ..ఏపీలో కేసీఆర్ ప్రభావం ఉండదని, తమకు వచ్చే నష్టమేమీ లేదని అంటున్నారు.

ప్రజస్వామ్యంలో కొత్త పార్టీలు రావడాన్ని స్వాగతిస్తామని, కానీ కొత్త పార్టీలు ఎన్ని వచ్చినా ఏపీలో ప్రజలు తమనే ఆదరిస్తారనే విధంగా వైసీపీ మంత్రులు మాట్లాడుతున్నారు. అయితే అసలు స్పందించకుండా ఉంటే ఎలాంటిది ఉండదు..కానీ బీఆర్ఎస్ ప్రభావం తమపై ఉండదు అంటూ..వైసీపీ నేతలు స్పందిస్తుంటే..ఏదో రాజకీయ కోణం కూడా కనిపిస్తోంది. అయితే వైసీపీ నేతలు చెబుతున్నట్లు కేసీఆర్ బీఆర్ఎస్ ప్రభావం ఏపీ రాజకీయాలపై పెద్దగా ఉండదు. కానీ కేసీఆర్ వ్యూహాలు తెలిసినవారు..ఆయన్ని తక్కువ అంచనా వేయరు కాబట్టి. రాజకీయాల్లో ఏదైనా జరగొచ్చు కాబట్టి జాగ్రత్తగా ఉండాలి.