రాకెట్ రాఘవ జబర్దస్త్ ను వీడకపోవడానికి కారణం అదేనా..?

జబర్దస్త్ ప్రారంభమై ఇప్పటికి ఎన్నో సంవత్సరాలు కావస్తోంది.. జబర్దస్త్ మొదలు పెట్టిన సమయంలో జడ్జిలుగా నాగబాబు, రోజా వ్యవహరించారు. యాంకర్ గా అనసూయ ఉండేది కానీ వీరంతా ఒక్కొక్కరుగా నెమ్మదిగా జబర్దస్త్ నుంచి బయటికి వెళ్లిపోయారు. కొత్తగా జబర్దస్త్ లోకి ఎంతోమంది కమెడియన్లు కూడా వస్తూ ఉన్నారు . అయితే ఇన్నాళ్లు కూడా జబర్దస్త్ ను వీడకుండా కేవలం రాకెట్ రాఘవనే కంటిన్యూ అవుతూ ఉన్నారు. ప్రతివారం కూడా రాఘవ స్కిట్ ప్రసారమవుతూ ఉన్నది. కొంతమంది టీం లీడర్లు వస్తూ పోతూ ఉన్నప్పటికీ రాకెట్ రాఘవ మాత్రం సినిమాలలో నటిస్తూ.. జబర్దస్త్ లో కూడా నటిస్తూ పలు షోలు చేస్తూ ఉన్నారు.

Rocket Raghava
ఇక ఇతర చానల్స్ వైపు కూడా రాఘవ ఎన్నో ఆఫర్లు వస్తున్న ఏ ఒక్క ఆఫర్ వైపు కూడా మగ్గు చూపలేదని చెప్పవచ్చు. ఈటీవీ మల్లెమాలవారు ఇస్తున్న రెమ్యూనరేషన్ కి దాదాపుగా రెండింతలు రెట్టింపు రెమ్యూనరేషన్ ఇస్తామన్నా కూడా ఇతర చానల్స్ వైపు వెళ్లలేదు. ఆమధ్య ప్రముఖ వ్యక్తి కూడా రాకెట్ రాఘవని జబర్దస్త్ నుంచి తీసుకు వెళ్లేందుకు చాలా ప్రయత్నాలు చేశారట. కానీ రాకెట్ రాఘవ మాత్రం డబ్బు ముఖ్యం కాదు మల్లెమాలతో తనకు ఉన్న బాండింగ్ ముఖ్యమని తెలియజేశారట.

Jabardasth Rocket Raghava Performance - Allari Pidugu Hilarious Comedy Skit  - YouTube
దీంతో రాకెట్ రాఘవ అరుదైన రికార్డును సొంతం చేసుకోబోతున్నారని చెప్పవచ్చు. ముఖ్యంగా 10 సంవత్సరాలుగా ఒకే షోలో కంటిన్యూ చేస్తూ ఏకైక కమెడియన్ గా గుర్తింపు తెచ్చుకొని అవకాశం ఉన్నది. ఈటీవీ వారికి, మల్లెమాలవారికి ప్రత్యేకంగా రాకెట్ రాఘవ అంటే అభిమానం ఉందని చెప్పవచ్చు. జబర్దస్త్ వల్లే తను ఈ పొజిషన్లో ఉన్నానని.. ఎన్ని ఆఫర్లు వచ్చిన తాను జబర్దస్త్ ను వదిలేయనని తాజాగా ఒక ఇంటర్వ్యూలో తెలియజేశారు రాఘవ. అందుచేతనే ఇతర షోల వైపు మొగ్గు చూపు లేదట రాఘవ.