జగన్ ‘పథకం’..టీడీపీ కార్నర్..!

వచ్చే ఎన్నికల్లో మళ్ళీ గెలిచి అధికారంలోకి రావడానికి జగన్ గట్టిగానే స్కెచ్‌లు వేస్తున్నారు. కాకపోతే గత ఎన్నికల మాదిరిగా ఈ సారి టీడీపీని ఓడించడం కాదు. అయితే అధికారంలోకి వచ్చాక టీడీపీని రాజకీయం తోక్కేశారని అనుకుంటున్నారు గాని..తొక్కడం పక్కన పెడితే..అసలు టీడీపీని పైకి లేపింది వైసీపీనే. వైసీపీ అనుసరించిన కొన్ని రాజకీయ విధనాలే టీడీపీకి బాగా ప్లస్ అయ్యాయి. ఇప్పుడు వైసీపీతో ఢీ అంటే ఢీ అనే పొజిషన్‌కు టీడీపీ వచ్చింది.

అయినా సరే ఎలాగైనా మళ్ళీ టీడీపీకి చెక్ పెట్టి అధికారంలోకి రావాలని జగన్ చూస్తున్నారు. ఈ క్రమంలోనే తాను అందించిన సంక్షేమ పథకాలతోనే అధికారం దక్కించుకోవాలని జగన్ చూస్తున్నారు. అందుకే అధికారంలోకి వచ్చాక ఏ పనిచేశారో తెలియదు గాని..టైమ్‌కు మాత్రం పథకాలు అందించారు. పథకాల ద్వారా ప్రజలకు నేరుగా డబ్బులు ఇచ్చారు. ఇప్పుడు డబ్బులు తీసుకున్నవారే తమకు అండగా ఉంటారని జగన్ భావిస్తున్నారు.

ఈ క్రమంలోనే నెక్స్ట్ మళ్ళీ తాము అధికారంలోకి వస్తేనే పథకాలు  కొనసాగుతాయని, టీడీపీ అధికారంలోకి వస్తే పథకాలు అందవని వైసీపీ ఇప్పుడు కొత్త ప్రచారం మొదలుపెట్టింది. అంటే ఇప్పుడు అందుతున్న పథకాలు కొనసాగాలంటే మళ్ళీ తమకే ఓటు వేయాలని వైసీపీ ప్రచారం చేస్తుంది. అలాగే వాలంటీర్లు, సచివాలయ ఉద్యోగులు కొనసాగాలన్న వైసీపీనే రావాలని, టీడీపీ అధికారంలోకి వస్తే ఈ వ్యవస్థలని తీసేస్తారని టీడీపీ నేతలు చెబుతున్నట్లుగా వైసీపీ ఫేక్ ప్రచారం ఒకటి తెరపైకి తీసుకొచ్చింది.

అంటే వాలంటీర్లు కూడా వైసీపీకి ఓటు వేయడం కష్టమా? అనే డౌట్ వైసీపీనే తీసుకొస్తుంది. అటు మూడు రాజధానులు నినాదం కూడా బాగా వాడుతున్నారు. ఓవరాల్ గా చూసుకుంటే పథకాలు వైసీపీకి కీలకంగా కానున్నాయి. టీడీపీ వస్తే ఆ పథకాలు పోతాయని చెప్పి ప్రచారం చేస్తున్నారు. మరి ప్రజలు పథకాలు, మూడు రాజధానుల బట్టే వైసీపీకి ఓటు వేస్తారా? అభివృద్ధి, పన్నుల బాదుడు, నిరుద్యోగం..ఇంకా ఇతర అంశాలని కూడా దృష్టిలో పెట్టుకుంటారా అనేది చూడాలి.