హీరో సాగర్ చనిపోవడానికి కారణం అదే.. సూర్య..!!

తపన చిత్రంతో మొదటిసారిగా తెలుగు సినీ పరిశ్రమకు పరిచయమయ్యారు నటుడు పింగ్ పాంగ్ సూర్య. ఆ తర్వాత రాజమౌళి సినిమా సై సినిమా లో నటించి మంచి పేరు సంపాదించారు. ఇక చిత్ర విజయంతో మంచి అవకాశాలను అందుకున్నారు. ఎన్నో సినిమాలలో హీరో ఫ్రెండ్ క్యారెక్టర్ లలో నటించారు సూర్య . ఇక చిరంజీవి వంటి హీరోల సినిమాలలో కూడా నటించారు. స్టార్ డైరెక్టర్ల సినిమాలలో కూడా సూర్య నటించారు. అయితే ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న పింగ్ పాంగ్ సూర్య పలు ఆసక్తికరమైన విషయాలను తెలియజేశారు వాటి గురించి చూద్దాం.

Tollywood Actor Pingpong Surya Biography, News, Photos, Videos | NETTV4U

కన్నడ ప్రొడ్యూసర్ కుమారుడైన యశోసాగర్ డైరెక్టర్ కరుణాకరణ్ దర్శకత్వంలో ఉల్లాసంగా ఉత్సాహంగా తో ఎంట్రీ ఇచ్చారు. ఈ సినిమాలో స్నేహ ఉల్లాల్ హీరోయిన్ గా నటించింది. ఈ చిత్రంలో హీరో స్నేహితుడు పాత్రలో పింగ్ పాంగ్ సూర్య నటించారని తెలిపారు. యశో సాగర్ యాక్సిడెంట్లో మరణించిన సంగతి అందరికీ తెలిసిందే. ఇక ఆయన గురించి సూర్య మాట్లాడుతూ చాలా సైలెంట్ గా ఉండేవారు. డైరెక్టర్ ఎలా చెబితే అలా ప్రాక్టీస్ చేసుకుంటూ కేవలం తన వర్కులో మాత్రమే ఎక్కువగా ఫోకస్ చేసేవారు. తనకు ఎలాంటి చెడు అలవాట్లు కూడా లేవని తెలిపారు.

Yasho Sagar
ఇలాంటి మంచి వ్యక్తి చిన్న వయసులోనే అది కూడా యాక్సిడెంట్ కారణంగా చనిపోవడం చాలా బాధాకరమని తెలిపారు. అయితే ఉల్లాసంగా ఉత్సాహంగా సినిమా మాత్రం బాగా సక్సెస్ అయ్యిందని ఇప్పటికి ఆ సినిమా చూస్తే ఎవరు నవ్వకుండా ఉండాలని తెలిపారు సూర్య. అయితే సాగర్ చాలా అందరితో క్లోజ్ గా ఉండేవారు. తనకు కూడా మంచి మిత్రుడు అని తెలిపారు. అయితే కేవలం తను స్పీడు వెళ్లడం వల్లే మరణించారని వార్తలు వినిపించాయి. ఆరోజు స్నేహ ఉల్లాల్ బర్తడే వేడుకలు జరుపుకొని తిరిగి వస్తున్న సమయంలో ఈ యాక్సిడెంట్ జరిగిందని సమాచారం.