చెవిరెడ్డికి రిస్క్ లేదు..పులివర్తికి ఛాన్స్ లేదు..!

ఇటీవల వైసీపీ వర్క్ షాపులో జగన్ క్లాస్ పీకిన ఎమ్మెల్యేల్లో చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కూడా ఉన్న విషయం తెలిసిందే. గడపగడపకు కార్యక్రమానికి చెవిరెడ్డి పెద్దగా నిర్వహించడం లేదని, తక్కువ రోజులు కార్యక్రమం నిర్వహించారని, ఇకపైన అయినా నియోజకవర్గంలో తిరగాలని జగన్..చెవిరెడ్డికి క్లాస్ ఇచ్చారు. అయితే చంద్రగిరిలో గడపగడపకు కార్యక్రమంలో చెవిరెడ్డి తనయుడు మొహిత్ పాల్గొంటున్నారు.

ఈ విషయంలో కూడా జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు..ఎమ్మెల్యేలు తిరగకుండా వారి తనయులు తిరిగితే కౌంట్ చేయనని చెప్పేశారు. ఎమ్మెల్యేలే గడపగడపకు వెళ్లాలని చెప్పారు. జగన్ క్లాస్ ఇవ్వడంతో తప్పు లేదు..కానీ చెవిరెడ్డికి గడపగడపకు పూర్తిగా వెళ్లాల్సిన అవసరం కూడా పెద్దగా లేదని చెప్పొచ్చు. ఎందుకంటే ఆయన ఎప్పుడు ప్రజల కోసమే పనిచేస్తూ ఉంటారు. నిత్యం ప్రజల్లోనే ఉంటారు. ఒకవేళ ఆయన అందుబాటులో లేకపోయినా..తన టీంని నియోజకవర్గంలో తిప్పుతారు. ఎక్కడకక్కడ ప్రజా సమస్యలు తెలుసుకుంటారు.

అలాగే ఆయన తనయుడు సైతం నియోజకవర్గంలో యాక్టివ్‌గా తిరుగుతున్నారు..ప్రజా సమస్యలు తెలుసుకుంటున్నారు. అసలు ఎటు చూసుకున్న చంద్రగిరిలో చెవిరెడ్డికి ఫుల్ పాజిటివ్ ఉంది. వచ్చే ఎన్నికల్లో మళ్ళీ ఆయన గెలుపుకు ఎలాంటి ఢోకా లేదనే విధంగా పరిస్తితి ఉంది. పైగా చంద్రగిరిలో టీడీపీ నేత పులివర్తి నాని బలం పెద్దగా పెరగలేదు. ఆయన సోషల్ మీడియాలో ఎక్కువ హడావిడిగా కనిపిస్తున్నారు తప్ప..నియోజకవర్గంలో పెద్దగా ప్రజల్లో తిరుగుతున్నట్లు కనిపించడం లేదు.

పైగా చంద్రగిరి ప్రజలు చెవిరెడ్డి పట్ల నెగిటివ్‌తో లేరు..అలాంటప్పుడు అక్కడ పులివర్తికి ప్లస్ రావడం కష్టమైన విషయం. అయితే ఇప్పటినుంచైనా పులివర్తి ఇంకా కష్టపడుతూ ప్రజల్లో తిరిగితే..కనీసం చెవిరెడ్డి మెజారిటీ అయినా తగ్గించగలుగుతారు. ఏదేమైనా చంద్రగిరిలో చెవిరెడ్డికి తిరుగులేదు అన్నట్లే ఉంది..ఇక పులివర్తికి మళ్ళీ గెలిచే ఛాన్స్ కూడా కనిపించడం లేదు.