నాడు ఎన్టీఆర్.. నేడు చిరంజీవి.. పండితుల చేతిలో అవమానపడ్డ స్టార్స్..!!

ఇటీవల హైదరాబాదులో జరిగిన అలయ్ బలయ్ కార్యక్రమంలో చిరంజీవి – గరికపాటి మధ్య జరిగిన సంఘటన ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది. ఇకపోతే గరికపాటి చిరంజీవిని అవమానించినట్టుగా మెగా అభిమానులు విపరీతంగా గరికపాటిని ట్రోల్ కూడా చేస్తున్నారు. నిజానికి ఈ కార్యక్రమంలో చిరంజీవితో ఫోటోలు దిగడానికి ఎంతోమంది యువతి యువకులు ఆయన దగ్గరకు చేరుకోగా.. పక్కనే ఉన్న గరికపాటి స్పీచ్ను ఎవరు వినలేదు. దాంతో ఆగ్రహం వ్యక్తం చేసిన గరికపాటి సత్వరమే ఫోటోషూట్ ఆపేసి చిరంజీవి రావాలని.. లేకపోతే తాను అక్కడ నుంచి వెళ్లిపోతానని మైక్ లో అనౌన్స్ చేశారు. అంతేకాదు స్పీచ్ మధ్యలో ఆపేసి వెళ్లిపోవడానికి ప్రయత్నం చేసినప్పుడు ఆర్గనైజర్స్ ఆయనను బ్రతిమాలి మళ్లీ కూర్చోబెట్టారు. అయితే ఫోటోషూట్ ఆపేసి చిరంజీవి గరికపాటి వద్దకు వచ్చి ఆయన క్షమాపణ కూడా కోరారు.అంతేకాదు తమ ఇంటికి భోజనానికి రావాలని కూడా ఆహ్వానించారు చిరంజీవి.

At 65: Chiru Super Strong, Late NTR Weakens! | cinejosh.com
అయితే సరిగ్గా ఇలాంటి ఘటనే గత 37 సంవత్సరాల క్రితం సీనియర్ ఎన్టీఆర్ జీవితంలో కూడా జరిగింది. సీనియర్ ఎన్టీఆర్ మంగళంపల్లి బాలమురళీకృష్ణ మధ్య ఈ సంఘటన జరగడం అప్పట్లో పెద్ద వాగ్వాదానికి దారితీసింది. బాలమురళీకృష్ణ సంగీత విద్వాంసుడు అనే విషయం అందరికీ తెలిసిందే. ఎన్టీఆర్ హీరోగా నటించిన నర్తనశాల , విరాటపర్వం వంటి సినిమాలలో బాలమురళీకృష్ణ పాటలు కూడా పాడారు. నిజానికి ఎన్టీఆర్ కి బాలమురళీకృష్ణ పై ఎంతో అభిమానం ఉండేది. అంతే కాదు అంతకు మించిన గౌరవం కూడా ఉండేది. బాలమురళీకృష్ణ కూడా ఎన్టీఆర్ ను గౌరవంగా పలకరించేవారు.

రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత వీరిద్దరి మధ్య విభేదాలు మొదలయ్యాయి . 1961లో లలిత కళ అకాడమీ అప్పటి కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ లోని శిల్పా మరియు చిత్ర కళాకారులను ప్రోత్సహించడానికి ఏర్పాటు చేయగా ఇందులో గొడవలు బాగా జరిగేవి. అలా 1985లో అవినీతిని, అక్రమాలను అణిచివేయడానికి ఎన్టీఆర్ లలిత కళ అకాడమీ రద్దు చేశారు. ఇక దీంతో వీరిద్దరి మధ్య గొడవలు వచ్చాయి. ఇక అలా నాడు జరిగిన సన్నివేశాలను నేడు జరుగుతున్న సన్నివేశాలను నెటిజెన్లు కూడా పోల్చి చూస్తూ ఉండడం ఆశ్చర్యకరం.