ఇప్పటికీ కూడా చిరంజీవి క్రేజ్ పడిపోలేదు అనడానికి ఇది చాలదా..!!

మెగాస్టార్ చిరంజీవి నటించిన తాజా చిత్రం గాడ్ ఫాదర్. ఈ సినిమాలో బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ తో పాటు నయనతార, సునీల్, సత్యదేవ్,పూరి జగన్నాథ్ కీలకమైన పాత్రలో నటించింది. ఇక డైరెక్టర్ మోహన్ రాజా దర్శకత్వం వహించారు. దసరా పండుగ సందర్భంగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం మంచి సూపర్ హిట్ టాక్ ను సొంతం చేసుకుంది. సౌత్ తో పాటు నార్త్ లో కూడా కలెక్షన్ల పరంగా బాగానే ఆకట్టుకుంటుంది.ఇదంతా ఇలా ఉండగా గాడ్ ఫాదర్ సినిమా ప్రదర్శించబోతున్న ఒక థియేటర్లో అభిమానులు అత్యుత్సాహం చూపించారు.

God Father 3 Days Total WW Collections!! : T2BLive
థియేటర్లలో ఏకంగా టపాసులు కాల్చి చాలా హడావిడి చేశారు దీంతో సినిమా చూస్తున్న ప్రేక్షకులు వెంటనే అక్కడి నుంచి బయటికి పరుగులు తీశారు.అందుకు సంబంధించిన ఒక వీడియో మాత్రం సోషల్ మీడియాలో చాలా వైరల్ గా మారుతోంది. ఇది మహారాష్ట్రలోని మాలేగావులోని ఒక థియేటర్లో జరిగిన సంఘటన అన్నట్లుగా తెలుస్తోంది. గాడ్ ఫాదర్ సినిమాలోని తార్ మార్ సాంగ్ ప్లే అవుతున్న సమయంలో కొంతమంది అభిమానులు థియేటర్లలో ఇలా బానిసంచాను పేల్చి చాలా సందడి చేశారు. దీంతో థియేటర్లో కొద్దిసేపు చాలా గందరగోళం నెలకొనిందని చెప్పవచ్చు. సినిమా చూస్తున్న ప్రేక్షకులు ఒక్కసారిగా భయభ్రాంతులతో బయటికి వచ్చారు.

Godfather: This is mass ra mawa.. Fans who burned tapas in the theater..  The audience ran away. – iittm.in

అందుకు సంబంధించి వీడియోల పై పలు రకాలుగా కామెంట్ చేస్తున్నారు నేటిజెన్లు. ఇది ఎక్కడి మాస్ రా మామ అని కొంతమంది కామెంట్లు చేస్తూ ఉండగా.. మరి కొంతమంది మాత్రం ఇప్పటికి చిరంజీవి హవా తగ్గలేదంటూ కామెంట్ చేస్తూ ఉన్నారు. ఇక సల్మాన్ ఖాన్ నటించిన అంతిమ్ సినిమా విడుదలైనప్పుడు కూడా కొంతమంది అభిమానులు గతంలో ఇలానే చేశారు ఈ విషయం తెలుసుకున్న సల్మాన్ ఖాన్ ఇలాంటి పనులు చేయవద్దని అభిమానులకు తెలియజేశారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ గా మారుతోంది.

https://twitter.com/salman_ka_abhi/status/1578654446275293185?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1578654446275293185%7Ctwgr%5E8935818240db465d212449046a6b6cce01587aa6%7Ctwcon%5Es1_c10&ref_url=https%3A%2F%2Ftv9telugu.com%2Fentertainment%2Ftollywood%2Fsalman-khan-fans-burst-firecrackers-in-godfather-theater-video-goes-viral-au76-798099.html