నా లైఫ్ ను మీరు కంట్రోల్ చెయ్యెద్దు.. పేరెంట్స్ కు ర‌ష్మిక వార్నింగ్‌!

నేషనల్ క్రష్ రష్మిక మందన గురించి ప్రత్యేకమైన పరిచయాలు అవసరం లేదు. కన్నడ మూవీ తో సినీ రంగ ప్రవేశం చేసిన ఈ బ్యూటీ `ఛ‌లో` తో టాలీవుడ్లోకి అడుగుపెట్టి.. అనతి కాలంలోనే ఇక్కడ స్టార్ హోదాను అందుకుంది. ప్రస్తుతం తెలుగులోనే కాకుండా తమిళ్, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో వరుస సినిమాలు చేస్తూ బిజీ హీరోయిన్గా దూసుకుపోతోంది.

రీసెంట్ గా బాలీవుడ్ లో రష్మిక డబ్యూ మూవీ `గుడ్ బై` విడుదల అయింది. బాలీవుడ్ బిగ్ బీ అమితాబ్ బచ్చన్ ఇందులో కీలకపాత్రను పోషించారు. అక్టోబర్ 7న‌ విడుదలైన ఈ చిత్రానికి మిశ్రమ స్పందన లభించింది. అయితే ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న రష్మిక తన కెరీర్ కు సంబంధించి ఎన్నో ఇంట్రెస్టింగ్ విషయాలను షేర్ చేసుకుంది.

ఇలాగే కెరీర్ ఆరంభంలో రష్మిక తన పేరెంట్స్ కు వార్నింగ్ కూడా ఇచ్చిందట. అసలు ఏమైందంటే రష్మిక సినిమాల్లోకి వస్తానని నిర్ణయించుకున్నప్పుడు.. అందుకు ఆమె పేరెంట్స్ అంగీకరించలేదట. సినీ ఇండస్ట్రీపై వారికి ఎన్నో భిన్నాభిప్రాయాలు ఉన్నాయట ఈ నేపథ్యంలోనే రష్మిక సినిమాలోకి వద్దని వాదించారట. కానీ, రష్మిక వెనక్కి తగ్గలేదట. ‘నాకు ఎదురయ్యే ప్రతి పరిస్థితిని ఎలా ఫేస్ చేయాలన్నది నాకు తెలుసు. నేను నా సొంత‌ ఎంపికలను ఎంచుకోనివ్వండి.. నా లైఫ్ నీ కంట్రోల్ చేయొద్దు. ఎందుకంటే ప్రపంచం మీరు అనుకున్న విధంగా లేదు..అంటూ రష్మిక తన పేరెంట్స్ కు నచ్చచెప్పిందట. ఇక ఫైనల్ గా వారు ఒప్పుకోవడంతో సినీ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన రష్మిక.. ప్రస్తుతం ఏ స్థాయిలో ఉందో ప్రత్యేకంగా వివరించక్కర్లేదు.