రీ-రిలీజ్‌కు సిద్ధ‌మ‌వుతున్న ప్ర‌భాస్ డిజాస్ట‌ర్ మూవీ.. ఇదేం విడ్డూరం!?

ఇటీవల టాలీవుడ్ లో పాత సినిమాల రీ-రిలీజ్ ల హడావిడి బాగా ఎక్కువైంది. స్టార్ హీరోల స్పెషల్ డేస్ ను పురస్కరించుకొని వారి వారి కెరీర్ లో సూపర్ డూపర్ హిట్స్ గా నిలిచిన చిత్రాలను అభిమానుల కోరిక మేరకు మళ్ళీ విడుదల చేస్తున్నారు. అయితే అనూహ్యంగా రీ-రిలీజ్ లో ఆయా చిత్రాలు అదిరిపోయే కలెక్షన్స్ ను వసూళ్ళు చేస్తూ రికార్డులు సృష్టిస్తున్నాయి. ఇకపోతే ఇప్పుడు ప్రభాస్ సినిమా సైతం రీ-రిలీజ్ కు సిద్ధమవుతోంది.

 

కానీ విడ్డూరం ఏంటంటే ప్రభాస్ కెరీర్ లో హిట్ అయిన చిత్రం కాకుండా డిజాస్టర్ సినిమాను రి- రిలీజ్ చేస్తున్నారు. ఆ సినిమా మరేదో కాదు `రెబల్`. రాఘవ లారెన్స్ దర్శకత్వంలో శ్రీ బాలాజీ సినీ మీడియా పతాకంపై జె.భగవాన్, జె.పుల్లారావ్ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఇందులో దీక్షా సేథ్, తమన్నా హీరోయిన్గా నటించగా.. కృష్ణంరాజు కీలక పాత్రను పోషించారు. 2012 సెప్టెంబర్ 28న విడుదలైన ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద డిజాస్టర్ గా నిలిచింది. ఇందులో స్టైలిష్ అండ్ రెబల్ గా ప్రభాస్ మాస్ క్యారెక్టర్ లో ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాడు. కమర్షియల్ గా హిట్ అవ్వకపోయినా.. ప్రేక్షకులను ఈ చిత్రం బాగానే ఆకట్టుకుంది. ఈ నేపథ్యంలోనే ప్ర‌భాస్ పుట్టిన‌రోజును సంద‌ర్భంగా అక్టోబ‌ర్ 15న ఈ చిత్రం రీ-రిలీజ్ కానుంది. రెబల్ సినిమాను న‌ట్టికుమార్ రీ రిలీజ్ చేయ‌నున్నారు.