ప్ర‌భాస్‌ ఫ్యాన్స్ పండ‌గ చేసుకునే అప్డేట్‌.. `స‌లార్‌` టీజ‌ర్‌కు డేట్ లాక్‌!?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ భారీ హిట్ కోసం ఎంతగానో ప్రయత్నిస్తున్నాడు. `బాహుబలి` వంటి సెన్సేషనల్ ఇండస్ట్రీ హిట్ తర్వాత `సాహో`, `రాధేశ్యామ్` సినిమాలు వరుసగా బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తాపడటంతో ప్రభాస్ కి నిరాశే మిగిలింది. ప్రస్తుతం ప్రభాస్ చేతిలో ఉన్న మూడు బిగ్గెస్ట్ ప్రాజెక్టులలో ఒకటి `సలార్`.

`కే జి ఎఫ్` సినిమాతో ఇండియా వైడ్ గా పాపులర్ అయిన ప్రముఖ దర్శకుడు ప్రశాంత్ నీల్ ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నాడు. ప్రశాంత్ నిల్ `కే జి ఎఫ్ 2` సినిమా బ్లాక్ బాస్టర్ హిట్ కొట్టడంతో ప్రభాస్ అభిమానులంతా ఈ సినిమాపై ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. అయితే సలార్ షూటింగ్ ప్రారంభమై ఇన్ని రోజులు గడుస్తున్నప్పటికీ సినిమాకు సంబంధించిన ఎటువంటి సమాచారం మాత్రం రావడం లేదు. ఈ విషయంపై డార్లింగ్ అభిమానులు మూవీ మేకర్స్ పై తీవ్ర అసహనానికి గుర‌వుతున్నారు.

అయితే తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఓ వార్త నెట్టింట వైరల్ గా మారింది. ప్ర‌భాస్‌ ఫ్యాన్స్ పండ‌గ చేసుకునే అప్డేట్.. త్వరలోనే రానున్నట్లు తెలుస్తుంది. `స‌లార్‌` టీజ‌ర్‌కు డేట్ లాక్‌… ప్రభాస్ బర్త్‌డే సందర్భంగా అక్టోబర్ 23న `సలార్` టీజర్ గ్లింప్స్‌ను విడుదల చేయనట్లు ఇండస్ట్రీలో వార్తలు వినిపిస్తున్నాయి. ఈ విషయం పై మేకర్స్ నుంచి అధికార ప్రకటన రావాల్సి ఉంది. ఫుల్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తరికెక్కుతున్న ఈ సినిమాలో ప్రభాస్ రెండు పాత్రలలో నటిస్తున్నాడట. ప్రభాస్ సరసన శృతిహాసన్ హీరోయిన్గా నటిస్తుంది. జగపతిబాబు ప్రముఖ పాత్రలో నటిస్తున్నాడు.

ప్రస్తుతం ప్రభాస్ నటించిన `ఆది పురుష` సినిమా రిలీజ్ కు రెడీగా ఉంది. రామాయణం కాన్సెప్ట్ తో తెరకెక్కనున్న ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 12న ప్రేక్షకుల ముందుకు వచ్చి అలరించబోతుంది. ఇప్పటికే ఈ సినిమా నుండి విడుదలైన ప్రభాస్ పోస్టర్లకు ప్రేక్షకుల నుండి విపరీతమైన రెస్పాన్స్ అందుకుంది.