బాలకృష్ణ హీరోగా చేయాల్సిన సినిమాని… ఎన్టీఆర్ హీరోగా చేశాడా షాకింగ్..!

తెలుగు చిత్ర పరిశ్రమలో ఎవరికి సాధ్యం కానీ రీతిలో నట సార్వభౌముడిగా గుర్తింపు తెచ్చుకున్న వారిలో నందమూరి తారకరామారావు గారు ఒకరు. ఆయన ఎన్నో వైవిధ్యమైన సినిమాలలో నటించారు. ఆయన తర్వాత నందమూరి కుటుంబం నుంచి సినిమాల్లోకి వచ్చిన వారిలో ప్రస్తుతం బాలకృష్ణ- జూ.ఎన్టీఆర్- కళ్యాణ్ రామ్ టాలీవుడ్ లో స్టార్ హీరోలోగా కొనసాగుతున్నారు. బాలకృష్ణ తన కెరియర్ ప్రారంభంలో తన తండ్రి ఎన్టీఆర్ తో కలిసి ఎన్నో సినిమాల్లో నటించారు. ఆయన మొదటి సినిమా తాతమ్మ కల ఎన్టీఆర్ దర్శకత్వం వహించారు. ఆ సినిమాలో ఎన్టీఆర్ కూడా నటించారు. ఆ తర్వాత వచ్చిన సినిమాల్లో కూడా ఎన్టీఆర్ -బాలకృష్ణ కలిసి నటించారు.

NTR - Balakrishna : తండ్రి ఎన్టీఆర్ ఓల్డ్ క్లాసిక్ టైటిల్స్‌తో తనయుడు  బాలకృష్ణ చేసిన సినిమాలు ఇవే.. | Balakrishna Nandamuri Done Many Movie  Titles Taken From His Father Legendary Hero ...

బాలకృష్ణ అప్పుడే టాలీవుడ్ లో తన కెరియర్ ప్రారంభిస్తున్న సమయంలో ఎన్టీఆర్ -బాలకృష్ణతో కలిసి ఒక మల్టీస్టారర్ సినిమా చేయాలని ఎస్ వెంకటరత్నం అనుకున్నారట. ఆ సందర్భంలోనే ఎన్టీఆర్ గారి దగ్గరికి వెళ్లి కథ చెప్పారట. కథ మొత్తం విన్న తర్వాత పాత్ర ఎంతో వైవిధ్యమైనదని.. అప్పుడప్పుడే హీరోగా నిలదొక్కుకుంటున్న బాలకృష్ణ ఆ పాత్రలో నటించలేడని.. ఆ పాత్ర నేను చేస్తానని దర్శక నిర్మాతలకు చెప్పి పంపించారట ఎన్టీఆర్. సాధారణంగా ఎవరైనా సరే కొడుకూ మంచి సినిమా అవకాశం వస్తే నటింపజేయాలని చూస్తారు. ఎన్టీఆర్ కథలో ఉన్న బలాన్ని చూసి బాలకృష్ణ చేయలేడు.. సినిమా విడుదలయ్యాక సినిమా పోతే దర్శక నిర్మాతలు ఇబ్బంది పడతారని ఎన్టీఆర్ ఆ సినిమాలో తానే నటించాడు.

 Sr Ntr About Yamagola Movie First Choice Balakrishna Details, Balakrishna, Ntr ,-TeluguStop.com

1977లో ఎన్టీఆర్ హీరోగా కైకాల సత్యనారాయణ యముడిగా తాతినేని రామారావు దర్శకత్వంలో వచ్చిన సినిమా యమగోల. అప్పట్లో ఈ సినిమా ఎన్నో సంచలమైన రికార్డులను క్రియేట్ చేసింది. ఈ సినిమాను ముందుగా బాలకృష్ణ హీరోగా ఎన్టీఆర్ తో యముడు పాత్ర చేయించాలని అనుకున్నారట. ఎన్టీఆర్ ఈ సినిమా బాలకృష్ణకు వద్దని చెప్పడంతో.. ఈ సినిమాలో హీరోగా ఎన్టీఆర్ నటించాడు.. కైకాల సత్యనారాయణ తో య‌ముడి పాత్ర చేయిద్దామని దర్శక నిర్మాతులకు ఎన్టీఆర్ చెప్పాడట. తర్వాత సినిమా షూటింగ్ పూర్తి చేసుకుని ప్రేక్షకుల ముందుకు వచ్చి బ్లాక్ బాస్టర్ హిట్ సాధించింది.