పొత్తు ఎఫెక్ట్: ఆ ఎమ్మెల్యేలు జంపింగ్..లిస్ట్ రెడీ?

ఏదేమైనా గాని టీడీపీ-జనసేన పొత్తు ప్రభావం మాత్రం వైసీపీపై బాగా పడేలా ఉంది..ఇప్పటివరకు పొత్తు ఉండకూడదని ఏదొక విధంగా పవన్ కల్యాణ్‌ని దమ్ముంటే 175 స్థానాల్లో పోటీ చేయమని, అభిమానుల ఓట్లని తాకట్టు పెడుతున్నారని చెప్పి వైసీపీ నేతలు రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తూ వచ్చారు. కానీ అనూహ్యంగా బాబు-పవన్ కలవడం రాష్ట్రంలో సెన్సేషన్‌గా మారింది. ఇక వీరు ఇప్పుడు పొత్తు గురించి ఏం మాట్లాడటం లేదు గాని..ఎన్నికల ముందు ఖచ్చితంగా పొత్తు ఫిక్స్ చేసుకోవడం ఖాయమని తెలుస్తోంది.

అయితే పొత్తు ఉంటే వైసీపీకి పెద్ద నష్టం జరిగే ఛాన్స్ ఉంది..ముఖ్యంగా కోస్తా జిల్లాల్లో వైసీపీకి డ్యామేజ్ ఉంటుంది..అదే సమయంలో పొత్తు ప్రభావం వల్ల కొందరు వైసీపీ ఎమ్మెల్యేలు పార్టీ మారే ఛాన్స్ కూడా ఉంటుంది. ఇప్పటికే కొందరు రెడీగా ఉన్నారని ప్రచారం ఉంది. ఇక పొత్తు ఫిక్స్ అవుతున్న నేపథ్యంలో ఆ పొత్తు బట్టి టీడీపీ లేదా జనసేనలోకి వెళ్ళే ఛాన్స్ ఉందని తెలుస్తోంది. కానీ ఇప్పటికిప్పుడు మాత్రం పార్టీ మారే ఛాన్స్ లేదు..ఇప్పుడు అధికారాన్ని వదులుకుని ఎవరూ పార్టీ మారరు. ఎన్నికల ముందే జంప్ అయ్యే ఛాన్స్ కనిపిస్తోంది.

అయితే ఇప్పటికే జంప్ అయ్యే ఎమ్మెల్యేల లిస్ట్ రెడీ అయిందని వైసీపీ అంతర్గత చర్చల్లో తేలిందట. టీడీపీ-జనసేన పొత్తు ఉంటే..ఉమ్మడి తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల నుంచి దాదాపు 8 మంది ఎమ్మెల్యేలు టీడీపీ లేదా జనసేనలో చెరోచ్చని తెలిసింది. ఇటు కృష్ణాలో ఇద్దరు ఎమ్మెల్యేలు, ప్రకాశంలో ఇద్దరు, నెల్లూరులో ఇద్దరు రెడీగా ఉన్నారట. ఇప్పటికే వీరు టీడీపీ-జనసేనలతో చర్చిస్తున్నారట…అలాగే సీట్లు కూడా రిజర్వ్ చేసుకుంటున్నారట. ఎన్నికల సమయంలో వీరు పార్టీ మారే ఛాన్స్ ఉందట.

అటు ఉత్తరాంధ్రలో కూడా అయిదారుగురు జంప్ అయ్యే అవకాశాలు కన్పిస్తున్నాయని అంటున్నారు. మరి చూడాలి ఎన్నికల సమయంలో ఎంతమంది ఎమ్మెల్యేలు జంప్ అవుతారో.