నాగార్జున హీరోగా రావడానికి కారణం చిరంజీవెనా.. కథ తెలిస్తే షాక్..!!

చిరంజీవి సినీ ఇండస్ట్రీలోకి కేవలం తన స్వయంకృషితోనే ఎంట్రీ ఇచ్చారని అందుచేతనే చిరంజీవి అంటే ఎందరికో స్ఫూర్తి అని ఇప్పటికీ చిరంజీవి గురించి ఎంతోమంది సినీ ఇండస్ట్రీలో మాట్లాడుతూ ఉంటారు. అయితే చిరంజీవి నటన ,ఫైట్స్, డాన్స్ చూసి మురిసిపోయిన వారు లేరని చెప్పలేము. అయితే ఇండస్ట్రీలోకి నాగార్జున అనుకోని విధంగా ఎంట్రీ ఇచ్చారు. హీరో కావడానికి చిరంజీవి కారణమన్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి వాటి గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

Megastar Chiranjeevi в Twitter: „' Sitarammayya Gari Manavaralu, 1991 ' 100  days function #ANR & #Chiru https://t.co/DGvwhqmQPw“ / Twitter
అయితే చిరంజీవి పైన కోపంతో ఏఎన్ఆర్ తన కుమారుడు నాగార్జునని హీరోగా చేశారట. చిరంజీవి తో ఏఎన్ఆర్ తన సొంత బ్యానర్ పై సినిమా చేయాలని ఎన్నో సంవత్సరాలు వెయిట్ చేయగా.. డేట్స్ అడ్జస్ట్ కాకపోవడం వల్ల చిరంజీవి నటించ లేదట. దీంతో ఏఎన్ఆర్ కోపం మీద అన్నపూర్ణ స్టూడియో బ్యానర్ పై విక్రమ్ మూవీతో నాగార్జునని హీరోగా పనిచేశారని డైరెక్టర్ గీతాకృష్ణ ఒకానొక సందర్భంలో తెలియజేశారు.

Vikram (1986) - Release Info - IMDb
చిరంజీవితో సినిమా తెరకెక్కించడానికి ఎన్నో ప్రయత్నాలు చేసిన.. తన డేట్లు అడ్జస్ట్ కాకపోవడంతో చివరికి ఏఎన్ఆర్ విసుగు వచ్చి అన్నపూర్ణ స్టూడియో బ్యానర్ పై విక్రమ్ సినిమాని తెరకెక్కించి భారీ విజయాన్ని అందుకున్నారు. నాగార్జున ఆతరువాత మజ్ను ,సంకీర్తన సినిమాల ద్వారా ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యారు. కుర్ర హీరోలకు పోటీగా పలు చిత్రాలు చేస్తూనే ఉన్నారు నాగార్జున. తెలుగు ప్రేక్షకులకు నాగార్జునకు ముద్దుపేరుగా మన్మధుడు అని పిలుస్తూ ఉంటారు.ఇక నాగార్జున నటించిన ది ఘోస్ట్ చిత్రం భారీ డిజాస్టర్ ని చవిచూసింది ఈ సినిమా ట్రైలర్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకున్న చిత్రం మాత్రం అభిమానులను నిరాశపరిచిందని చెప్పవచ్చు. ప్రస్తుతం నాగార్జున 100 వ చిత్రం పైన భారీ అంచనాలు పెట్టుకున్నారు అభిమానులు మరియు చిత్రంతోనైనా సక్సెస్ అవుతారెమో చూడాలి.