కాంతార చిత్రంపై సంచలన వ్యాఖ్యలు చేసిన రాంగోపాల్ వర్మ..!!

కే జి ఎఫ్ వంటి సంచలన విజయాన్ని అందుకున్న తరువాత కన్నడ సినిమాలు ఈ మధ్యకాలంలో దేశవ్యాప్తంగా విడుదలవుతూ ఉన్నాయి. అలా విడుదలైన వాటిలో కన్నడలో నటించిన రక్షిత్ శెట్టి చార్లీ -777, కిక్చా సుదీప్ నటించిన విక్రాంత్ రోణ, వాటి సినిమాలు బ్లాక్ బస్టర్ విజయంగా నిలిచాయి. ఈ సినిమాలు దేశవ్యాప్తంగా పేరును వినిపించేలా చేశాయి తాజాగా విడుదలైన కాంతారా చిత్రం దేశవ్యాప్తంగా సంచలనాన్ని సృష్టిస్తోంది. ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద పలు రికార్డు స్థాయిలో వసూలను కూడా రాబడుతోంది పక్కా కనడ నేటివిటీ నేపథ్యంతో తెరకెక్కించిన దర్శకుడు, హీరో రిషబ్ శెట్టి ఈ చిత్రాన్ని ఎంతో అద్భుతంగా తెరకెక్కించారు.

RGV: కాంతార మూవీపై రాంగోపాల్ వర్మ ప్రశంసల వర్షం
ఈ సినిమా కన్నడ నాట చర్చనీయంశంగా మారుతోంది. గత శనివారం కూడా తెలుగులోపాటు హిందీలో కూడా విడుదలై ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటోంది. కే జి ఎఫ్ వంటి బడా చిత్రాన్ని నిర్మించిన బ్యానర్ హోంబలే ఈ చిత్రాన్ని నిర్మించింది. ఈ చిత్రం ఇప్పుడు టాలీవుడ్లో పెద్ద హాట్ టాపిక్ గా మారుతోంది. ఈ సినిమా పైన పలువురు స్టార్స్ సైతం సోషల్ మీడియాలో పలు రకాలుగా ట్వీట్లు చేయడం జరిగింది.ఇప్పటికే ప్రభాస్, అనుష్క తదితర నటీనటులు సైతం ఈ సినిమా పైన ప్రశంశాల వర్షం కురిపించారు.

అయితే ఇప్పుడు తాజాగా రాంగోపాల్ వర్మ కూడా సోషల్ మీడియాలో స్పందిస్తూ.. అగ్రతారాలు సూపర్ స్టార్స్ భారీ నిర్మాణ విలువలు విఎఫ్ఎక్స్ మాత్రమే మాత్రమే ప్రేక్షకుల్ని థియేటర్లకు రప్పిస్తారని ఫిక్స్ అయిన సినిమా వాళ్ళ నిర్ణయం తప్పని కాంతార చిత్రం నిరూపించిందని తెలిపారు. ఇలాంటి ఒక నిర్ణయించుకున్న వేళ ఒక అగ్ర తారాగణం లేకుండా తెరకెక్కించిన చిన్న చిత్రం కాంతార వారి చిత్రాల రికార్డులను బ్రేక్ చేసిందని తెలియజేశారు. రూ.16 కోట్ల రూపాయల బడ్జెట్ తో తెరకెక్కించిన ఈ చిత్రం పెద్దగా పరిచయం లేని ఆర్టిస్టులతో హోంబలే ఫిలిమ్స్ నిర్మించింది అలాంటి ఈ సినిమా IMBD లోనే RRR,KGF వంటి చిత్రాలను బీట్ చేసీ IMDB లోనే 9.5 రేటింగును సొంతం చేసుకుంది.

https://twitter.com/RGVzoomin/status/1581897569529368576?s=20&t=ZCGWyBLuQ_9ICFvUrhJiXA