సినిమాలతో పాటు.. బిజినెస్ లోనూ రాణిస్తున్న స్టార్స్..

సాధారణంగా ప్రొఫెషనల్ లైఫ్ లో సంపాదించడమే కాకుండా మనకు ఇష్టమైన రంగంలో బిజినెస్ చేయాలని చాలా మందికి ఉంటుంది.. దీనిని చాలా మంది సెలబ్రెటీలు కూడా ఫాలో అవుతున్నారు. ఒకవైపు సినిమాలు చేస్తూ కోట్లలో సంపాదిస్తున్న సినీ సెలబ్రెటీలు.. బిజినెస్ లోకి ఎంట్రీ ఇచ్చారు. రకరకాల వ్యాపారాలు చేస్తూ అందులోనూ రాణిస్తున్నారు. అలా సక్సెస్ ఫుల్ బిజినెస్ మ్యాన్ గా పేరు తెచ్చుకున్న హీరో, హీరోయిన్లు టాలీవుడ్ లో చాలా మంది ఉన్నారు. ప్రస్తుతం సినిమాలు చేస్తూ.. బిజినెస్ లో రాణిస్తున్న టాలీవుడ్ హీరోలు, హీరోయిన్ల గురించి ఇప్పుడు తెలుసుకుందాం..

నాగార్జున:

టాలీవుడ్ లో బిజినెస్ మ్యాన్ అంటే ముందుగా వరుసలో ఉంటారు కింగ్ నాగార్జున. ఒకవైపు సినిమాలు చేస్తూనే అన్నపూర్ణ స్టూడియోస్ యజమానిగా, అన్నపూర్ణ బ్యానర్ లో ప్రొడ్యూసర్ గా విజయవంతమైన సినిమాలు నిర్మించారు. దీంతో పాటు ‘ఎ గ్రిల్’ రెస్టారెంట్ అండ్ హోటల్ స్థాపించి హాస్పటాలిటీ రంగంలోనూ రాణిస్తున్నారు. సచిన్ టెండూల్కర్, మెగాస్టార్ చిరంజీవితో కలిసి కేరళ బ్లాస్టర్స్ ఫుట్ బాల్ జట్టును కొన్నారు. అంతేకాదు.. ఎంఎస్.ధోనితో కలిసి ఓ రేసింగ్ టీమ్ కి పార్ట్నర్ గా ఉన్నారు.

వెంకటేష్:

హీరో వెంకటేష్ తన అన్నతో కలిసి సురేష్ ప్రొడక్షన్స్ ప్రారంభించారు. దీంతోపాటు ఇటీవల ఎలక్ట్రిక్ ఛార్జింగ్ స్టేషన్స్ బిజినెస్ లో ఎంట్రీ ఇచ్చారు. ‘బైక్ వో’ పేరుతో స్టార్టప్ ని ప్రారంభించారు. 2025 నాటికి దేశంలో 20 వేల ఈవీ ఛార్జింగ్ స్టేషన్లు ప్రారంభించాలని టార్గెట్ గా పెట్టుకున్నారు..

మహేష్ బాబు:

సూపర్ స్టార్ మహేష్ బాబు ఏషియన్ సినిమాస్ వాళ్లతో టై అప్ అయ్యి ఏఎంబి సినిమాస్ మల్టీప్లెక్స్ బిజినెస్ లోకి దిగారు. తన పేరు మీదే ఎంటర్టయిన్మెంట్ సంస్థను స్థాపించాడు. హంబుల్ కో పేరుతో టెక్ట్స్ టైల్ ఇండస్ట్రీలో ఎంట్రీ ఇచ్చారు. మినర్వాతో కలిసి బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 12లో లగ్జరీ రెస్టారెంట్ ని స్టార్ట్ చేయబోతున్నారు. పర్ఫ్యూమ్ వ్యాపారంలోకి దిగనున్నట్లు సమాచారం. మెగాస్టార్ చిరంజీవి, రామ్ చరణ్ తో కలిసి ఓ ప్రొడక్షన్ హౌజ్ స్టార్ట్ చేశారు. ట్రూజెట్ ఏయిర్ లైన్స్ కి కో-ఓనర్ గా ఉన్నారు.

రామ్ చరణ్:

హీరో రామ్ చరణ్ కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ పెట్టి ఖైదీ నం.150, ఆచార్య లాంటి సినిమాలు ప్రొడ్యూస్ చేశారు. ఇది కాకుండా ఎయిర్ లైన్స్ బిజినెస్ లో అడుగుపెట్టారు. ట్రూజెట్ ఎయిలైన్స్ చైన్ ని కలిగి ఉన్నాడు.

అల్లు అర్జున్:

అల్లు అర్జున్ తన స్టూడియోస్ ని చూసుకుంటూనే అల్లు ఎంటర్టైన్మెంట్ పేరుతో ప్రొడక్షన్ హౌజ్ ని నడుపుతున్నారు. ఎం.కిచెన్ పేరుతో ఇంటర్నెషనల్ బ్రూవింగ్ కంపెని ప్రారంభించారు. దీని కింద 800 జూబ్లీ పేరుతో బ్రూవింగ్, నైట్ క్లబ్ రెస్టారెంట్ రన్ చేస్తున్నారు. అల్లు అర్జున్ కి బి-డబ్స్ అనే స్పోర్ట్స్ బార్ లో భాగస్వామ్యం ఉంది.

రానా దగ్గుబాటి:

రానా దగ్గుబాటి సినిమాలతో బిజినెస్ లోనూ రాణిస్తున్నారు. 24 క్రాఫ్ట్స్ లో నాలెడ్జ్ ఉన్న రానా, కావ్యాన్ ట్యాలెంట్ మ్యానేజ్మెంట్ కంపెనీలో పెట్టుబడి పెట్టాడు. దీంతో పాటు వీడియో గేమింగ్ సంస్థలో పెట్టుబడులు పెట్టారు. ఇటీవల తన స్టార్టప్ ఐకాన్జ్ తో మెటావర్స్ లోకి ఎంటర్ అయ్యాడు..

విజయ్ దేవరకొండ:

విజయ్ దేవరకొండ సినిమాలతో పాటు బిజినెస్ చేస్తున్నారు. ఇటీవల రౌడీ క్లబ్ పేరుతో క్లాతింగ్ బ్రాండ్ ని ప్రారంభించారు. దీంతో పాటు ఏవీడీ పేరుతో మహబూబ్ నగర్ లో మల్టీప్లెక్స్ స్థాపించారు. తన తమ్ముడు ఆనంద్ దేవరకొండ సైతం ఈవీ బిజినెస్ లో ఎంట్రీ ఇచ్చారు.

ఎన్టీఆర్-రామ్ చరణ్:

జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ ఎంతో మంచి ఫ్రెండ్స్.. వీరిద్దరు కలిసి ‘ఆర్ఆర్ఆర్’ పేరుతో భారీ రెస్టారెంట్ ప్రారభించే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది..

ఇతర హీరోలు

హీరో నాగశౌర్య రియల్ ఎస్టేట్ వ్యాపారంలోకి దిగాడు.. నవదీప్ కి సీ స్పేస్ అని మూవీ ప్రమోటర్ ఈవెంట్ మేనెజ్మెంట్ సంస్థ ఉంది. సింగర్ రాహుల్ ఊకో-కాక పేరుతో టెక్ట్స్ టైల్ బ్రాండింగ్ ప్రారంభించాడు. సందీప్ కిషన్ వివాహ భోజనంబు పేరుతో రెస్టారెంట్ ప్రారంభించబోతున్నాడు. నాగచైతన్య త్వరలోనూ షోయూ పేరుతో క్లౌడ్ కిచెన్ ప్రారంభించనున్నాడు.

హీరోయిన్లు:

* చాలా మంది హీరోయిన్లు కూడా నటనతో పాటు బిజినెస్ లోనూ రాణిస్తున్నారు. రకూల్ ప్రీత్ సింగ్ ఆస్ట్రేలియన్ బ్రాండ్ ఎఫ్-45 ని ఫ్రాంచైజీలుగా తీసుకుని నడిపిస్తోంది.

* తమన్నా వైట్ ఎన్ గోల్డ్ పేరుతో గతంలోనూ జ్యువెలరీ స్టోర్ లను స్థాపించింది.

* సమంత సాకీ పేరుతో బట్టల వ్యాపారాన్ని ప్రారంభించింది. ఇటీవల ఏకమ్ పేరుతో ప్లే స్కూల్ ని స్థాపించింది.