ప్రభాస్​ తో నా రిలేషన్​ అదే.. పీవీ సింధు సంచలన వ్యాఖ్యలు.. !!

పీవీ సింధు,, ఈ పేరుకు ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు. మన దేశ ప్రతిష్టను ప్రపంచ దేశాలకు తెలిసేలా చేసిన స్టార్ అధ్లేట్ పీవీ సింధు గురించి ఎంత చెప్పినా తక్కువే. పీవీ సింధు పూర్తి పేరు పూసర్ల వెంకట సింధు. భారత బ్యాడ్మింటన్ క్రీడాకారిణిగా తన పేరును మారుమోగిపోయేలా చేసుకుంది. 2016లో జరిగిన రియో ఒలింపిక్ క్రీడల్లో పీవీ సింధు రజత పథకం సాధించి మన దేశ సత్తాను అందరికీ తెలిసేలా చేసింది. అంతేకాదు రియో ఒలంపిక్ క్రీడల్లో రజత పథకం సాధించిన తొలి భారతీయ మహిళగా పూసర్ల వెంకట సింధు ఓ సరికొత్త రికార్డు సృష్టించింది. అంతేకాదు టోక్యో 2020 ఒలంపిక్స్ లో కూడా సింధు కాంస్య పతకం గెలుచుకుంది. ఇలా తన టాలెంట్ తో మన దేశ ప్రతిష్టను పెంపొందించేలా చేస్తుంది.


కాగా ఇన్నాళ్లు బ్యాట్ పట్టుకొని గ్రౌండ్ లో ఆట ఆటాడిన సింధు ఫస్ట్ టైం టెలివిజన్ షో కి గెస్ట్ గా వచ్చింది. ఈటీవీలో ప్రసారమయ్యే ఆలీతో సరదాగా సోకు పివి సింధు గెస్ట్ గా వచ్చింది. దీనికి సంబంధించిన ప్రోమోని కొద్దిసేపటి క్రితమే ఈటీవీ మేనేజ్మెంట్ రిలీజ్ చేసింది. కాగా ఈ ప్రోమోలో పీవీ సింధు అలీ తో..సరదాగా మాట్లాడుకున్న పద్ధతి మీడియాలో వైరల్ గా మారింది. ఈ ప్రోమోలో ఆలీ.. పీవీ సింధును చాలా ఫన్నీ క్వశ్చన్స్ తో ఇబ్బంది పెట్టడానికి ట్రై చేశారు. కానీ పీవీ సింధు చాకచక్యంగా ఆ ప్రశ్నలకు సమాధానం ఇస్తూ తనదైన స్టైల్ లో ఆన్సర్స్ ఇచ్చి..షాక్ ఇచ్చింది, ఈ క్రమంలోనే తనకు పాన్ ఇండియా హీరో ప్రభాస్ తో ఉన్న రిలేషన్ షిప్ గురించి ఫస్ట్ టైం మీడియా ముందు బయటపెట్టింది.

ఈ ఇంటర్వ్యూ చాలా ఫన్నీ క్వశ్చన్స్ తో సరదాగా సాగిపోయిన్నత్లు ప్రోమో బట్టే తెలిసిపోతుంది. వీళ్ళ సంభాషణ మధ్యలో ప్రభాస్ వరకు వచ్చి ఆగింది. ఈ క్రమంలోని ఆలీ “మీకు ఇష్టమైన హీరో ఎవరు” అని అడగ్గా.. పీవీ సింధు సమాధానమిస్తూ..” టాలీవుడ్ లో నాకు ఇష్టమైన హీరోలు చాలామంది ఉన్నారు” అని చెప్తుంది. అప్పుడు ఆలీ..” అందరు కాదు ది మోస్ట్ ఎవరు ..ఒకే ఒక్కరు..” అనడంతో.. అప్పుడు..” హ్యాండ్సమ్ హీరో ప్రభాస్ అంటే ఇష్టం అని చెప్పుకొస్తుంది”. అప్పుడు ఆలీ “ఎందుకు మీ అంత హైట్ ఉన్నారనేగా”.. అంటూ సరదాగా నవ్విస్తాడు. సింధు కూడా “ఎస్ ఎస్ అవును మా ఇద్దరి రిలేషన్ అదే “అంటూ సరదాగా నవ్వుతూ ఆన్సర్ ఇచ్చింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మొత్తంగా ఇద్దరు సంభాషణలతో ఈ ఎపిసోడ్ చాలా ఫన్నీగా జరిగినట్టు ప్రోమో చూస్తుంటేనే అర్థం అవుతుంది.