ఓరి దేవుడో.. శృతి అంత పెంచేసింది ఏంట్రా బాబు..చూడలేక చస్తున్నాం..!?

శృతిహాసన్.. ఈ పేరు గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు. మల్టీ టాలెంటెడ్ లోకనాయకుడు కమల్ హాసన్ కూతురుగా సినీ ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన ఈ ముద్దుగుమ్మ ఇండస్ట్రీకి వచ్చిన కొత్తల్లో ఒక్క హిట్ కొట్టడానికి నానాతంటాలు పడింది. స్టార్ సినిమాలో అవకాశాలు అందుకున్న ఒక్క హిట్టు కూడా కొట్టలేకపోయింది. వరుస ఫ్లాప్ సినిమాలు తన ఖాతాలో వేసుకున్న ఏమాత్రం దిగులు చెందకుండా తన నటనపై నమ్మకంతో మంచి మంచి సినిమా స్టోరీస్ ను చూస్ చేసుకుంటూ ఫైనల్ గా పవన్ కళ్యాణ్ హీరో గా నటించిన గబ్బర్ సింగ్ తో ఫస్ట్ హిట్ సినిమాను రుచి చూసింది.

ఇక ఆ తర్వాత కొన్నాళ్లు సినీ ఇండస్ట్రీను తన అంద చందాలతో ఏలేసిన ఈ ముద్దుగుమ్మ మళ్ళీ ఫ్లాప్స్ ను తన ఖాతాలో వేసుకొని ఫెడవుట్ హీరోయిన్ గా పేరు సంపాదించుకుంది. దీంతో కొన్నాళ్ళు సినీ ఇండస్ట్రీకి దూరంగా ఉంటూ బాయ్ ఫ్రెండ్స్ ని మారుస్తూ ఓ రేంజ్ లో ఎంజాయ్ చేసింది . శృతి హీరోయిన్ గా కన్నా కూడా బాయ్ ఫ్రెండ్స్ ను మార్చిన అమ్మాయి గానే ఎక్కువ పాపులర్ అయింది. కాగా ప్రజెంట్ శృతి చేతిలో మూడు సినిమాలు ఉన్నాయి.

 

 

ఒకటి ప్రభాస్ హీరోగా నటిస్తున్న సలార్.. రెండోది బాలకృష్ణ ష్ణ 107 సినిమాలో ఆయనకు హీరోయిన్ గా నటిస్తుంది. రెండోది చిరంజీవి వాల్తేరు వీరయ్య సినిమాలో మెగాస్టార్ కు జోడిగా నటిస్తుంది. అయితే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ బ్యూటీ కోలీవుడ్ స్టార్ హీరో సినిమాలో నటించే ఛాన్స్ కొట్టేసినట్లు తెలుస్తుంది. ఈ సినిమా కోసం అమ్మడు ఏకంగా నాలుగు కోట్ల డిమాండ్ చేస్తుందట. దానికి కారణం లేకపోవనూ లేదు ప్రజెంట్ అమ్ముడు కమిటీ అయిన మూడు సినిమాలు స్టార్స్ వే. కచ్చితంగా హిట్స్ సాధించగలిగే సినిమాలు. దీంతో అమ్మడు ఆ బ్యాక్ గ్రముడ్ చూసుకుని తన మార్కెట్ పెంచుకోవడానికి ట్రై చేస్తుంది అంటున్నారు కోలీవుడ్ వర్గాలు. ప్రజెంట్ శృతిహాసన్ ఒక్కో సినిమాకి రెండు నుంచి మూడు కోట్ల వరకు అందుకుంటుంది. ఇప్పుడు ఈ సంఖ్యను మూడు నుంచి నాలుగు కోట్లకు చేసినట్లు తెలుస్తుంది. ఏది ఏమైనా శృతిహాసన్ ఇలా రేటు పెంచేస్తే ఆమెను తెరపై చూడలేము రా బాబోయ్ అంటున్నారు ఆమె ఫ్యాన్స్.