ఆ ఒక్క రీజన్ తోనే పెళ్లికి దూరంగా ఉంటున్న..తన ప్రాబ్లమ్ ని బయటపెట్టేసిన లావణ్య త్రిపాఠి..!

లావణ్య త్రిపాఠి..ఓ అందాల బొమ్మ కాదు కాదు ..ఓ అందాల రాక్షసి. ఇదే మాట అంటుంటారు ఆమెని చూసిన జనాలు. అందాల రాక్షసి సినిమా ద్వారా తెలుగు చలనచిత్ర పరిశ్రమలోకి హీరోయిన్ గా అడుగుపెట్టిన ఈ లావణ్య త్రిపాఠి ..ఇండస్ట్రీకి వచ్చిన ఇండస్ట్రీకి వచ్చి చాలా కాలమే అయినా ఇంకా స్టార్ హీరోయిన్ లిస్టులోకి చేరలేదు. దానికి కారణాలు చాలానే ఉన్నాయి. చూడడానికి యంగ్ గా కనిపించిన సీనియర్ హీరో సినిమాలలో నటించడానికి అమ్మడు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడమే ఇందుకు ప్రధాన కారణం.

నిజానికి హీరో నాగార్జున వయసు , లావణ్య త్రిపాఠి వయసు మధ్య చాలా తేడా.. కానీ, సోగ్గాడే చిన్నినాయన సినిమాలో ఆయనకి భార్యగా నటించింది. అక్కడే సగం ఆమె మైనస్ అయ్యింది. ఈ సినిమా వరకు అమ్మడికి అవకాశాలు అంతో ఇంతో వచ్చినా.. నాగార్జున పక్కన నటించాక సినిమా అవకాశాలు పూర్తిగా దూరమయ్యాయి. దీంతో వచ్చిన సినిమాలలో నచ్చిన సినిమాలు చేసిన మెప్పించడానికి ట్రై చేస్తుంది ఈ ముద్దుగుమ్మ. సినిమాల పరంగా ఎలా ఉన్నా లావణ్య త్రిపాఠి వ్యక్తిగత జీవితంలో ఎప్పుడు మీడియాలు ట్రెండింగ్ లోని ఉంటుంది .

మెగా హీరో వరుణ్ తేజ్ తో రెండు సినిమాలు చేసింది. అంతే, ఈ సినిమాల్లో వాళ్ళిద్దరి రొమాన్స్ కు జనాలు ఫిదా అయ్యారు. ఇద్దరు కెమిస్ట్రీ బాగుండడంతో పెళ్లి చేసుకోబోతున్నారు అంటూ వార్తలు వైరల్ అయ్యాయి. అలాంటి వార్తలుకు ఆజ్య, పోసిన్నట్లు.. వీళ్లు ప్రైవేట్ పార్టీలు చేసుకుంటూ చాలా క్లోజ్ గా మూవ్ అవుతున్న పిక్స్ సోషల్ మీడియాలో లీక్ అయ్యి వైరల్ గా మారాయి. రీసెంట్ గా లావణ్య త్రిపాఠి వరుణ్ తేజ్ ఓ కామన్ ఫ్రెండ్ ప్రైవేట్ పార్టీలో ఎంజాయ్ చేసిన పిక్స్ సోషల్ మీడియాను షేక్ చేశాయి. దీంతో వీళ్లిద్దరు త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారు అంటూ మళ్ళీ వార్తలు వైరల్ అయ్యాయి.

ఈ క్రమంలోనే లావణ్య త్రిపాఠి అలాంటి వార్తలపై స్పందిస్తూ..” మేమిద్దరం కేవలం ఫ్రెండ్సే అని, మా మధ్య ప్రేమ దోమ లాంటివి లేవని”.. క్లారిటీ ఇచ్చింది. అంతే కాదు..తాను ఇప్పటివరకు ఎందుకు పెళ్లి చేసుకోలేదో కూడా క్లారిటీ ఇచ్చింది. “తన మనసుకు నచ్చిన వ్యక్తి ఇప్పటివరకు తనకు కనపడలేదని ఆ కారణంతోనే ఇంకా పెళ్లి చేసుకోలేదని తన మనసుకు నచ్చిన వ్యక్తి కనిపించిన క్షణం మీకే చెప్పి పెళ్లి చేసుకుంటానని” ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది. దీంతో లావణ్య త్రిపాఠి , వరుణ్ తేజ్ మధ్య ఏ సంబంధం లేదని మరోసారి క్లారిటీ ఇచ్చిన్నట్లైంది.