ఎన్టీఆర్ కోసం క్యూలో ఉన్న దర్శకులు..

తన నటనతో ప్రేక్షకులను మెప్పించగల సత్తా ఉన్న హీరో జూనియర్ ఎన్టీఆర్.. ఎలాంటి పాత్రలో అయినా ఒదిగిపోతాడు.. అందుకే ఎన్టీఆర్ తో సినిమా చేయడానికి దర్శకులు ఎప్పుడూ సిద్ధంగానే ఉంటారు. ఇక ఆర్ఆర్ఆర్ సినిమాలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. ప్రపంచ వ్యాప్తంగా తన స్టామినా ఏంటో చూపించాడు.. ఆర్ఆర్ఆర్ సినిమా తర్వాత ఎన్టీఆర్ కోసం స్టార్ దర్శకులు క్యూలో ఉన్నారు.. ఇప్పటికే స్టార్ డైరెక్టర్ కొరటాల శివ దర్వకత్వంలో తారక్ 30వ చిత్రాన్ని తెరకెక్కించేందుకు రెడీ అవుతున్నాడు. వచ్చే నెలలో ఈ సినిమాను మొదలుపెట్టడానికి సిద్ధమవుతున్నారు. ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ పూర్తి చేసుకుంది. పొలిటికల్ సెటైర్ గా ఈ సినిమా రూపొందుతుందని టాక్.. వీరి కాంబినేషన్ లో గతంలో వచ్చిన జనతా గ్యారేజ్ ఎంత భారీ విజయం అందుకుందో తెలిసిందే.

కాగా, ఎన్టీఆర్ తో సినిమా కోసం చాలా మంది దర్శకులు వెయింటింగ్ లో ఉన్నారు. ఇప్పటికే ఎన్టీఆర్ ఇద్దరు దర్శకులతో సినిమా చేయడానికి రెడీ అయ్యాడు. కన్నడ దర్శకుడు ప్రశాంత్ నీల్ తో ఓ పాన్ ఇండియా సినిమాను ప్లాన్ చేస్తున్నాడు ఎన్టీఆర్. ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించబోతుంది. మొదట్లో ఈ సినిమా ఉంటుందా లేదా అనే అనుమానాలు ఉండేవి. కానీ ప్రశాంత్ నీల్ భార్య ఎన్టీఆర్ సినిమాపై క్లారిటీ ఇచ్చారు.

బుచ్చిబాబు దర్శకత్వంలో ఎన్టీఆర్ మరో సినిమాను చేయబోతున్నాడు. వీరితో పాటు ఎన్టీఆర్ కి మరి కొంతమంది దర్శకులు స్టోరీలు వినిపించారు. వారిలో కొంతమంది బాలీవుడ్ దర్శకులు సైతం ఉన్నట్లు తెలుస్తోంది.. ఈ మూడు సినిమాలను వచ్చే ఏడాదిలో పూర్తి చేయాలని ఎన్టీఆర్ ప్లాన్ చేశాడు. వీటి తర్వాత మిగితా దర్శకులతో సినిమా చేసేందుకు రెడీ అవుతున్నాడు..