‘బీసీ’ పాలిటిక్స్: పెద్ద వ్యూహమే!

ఏపీలో రాజకీయాలు కులాల ఆధారంగానే నడుస్తాయనే సంగతి తెలిసిందే…ప్రతి రాజకీయ పార్టీ కులాన్ని బేస్ చేసుకుని రాజకీయం చేస్తూ ఉంటాయి. ఏ టైమ్ లో ఏ కులాన్ని ఆకట్టుకోవాలన్న ప్రణాళికలతో ముందుకెళ్తాయి. ముఖ్యంగా ఏపీలో గెలుపోటములని డిసైడ్ చేసే బీసీ ఓట్లని ఆకర్షించడానికి రాజకీయ పార్టీలు వేయని ఎత్తులు ఉండవు. అయితే టీడీపీ అంటే బీసీల పార్టీ అనే ముద్ర ఉంది…మొదట నుంచి బీసీలు ఆ పార్టీకి సపోర్ట్ చేస్తూ వస్తున్నారు.

కానీ గత ఎన్నికల్లో రాజకీయ సమీకరణాలు మారిపోయాయి…ఎక్కువ శాతం బీసీలు వైసీపీకి మద్ధతు ఇచ్చారు…జగన్ పాదయాత్ర చేయడం, పాదయాత్రలో బీసీలకు పలు హామీలు ఇవ్వడంతో ఎన్నికల్లో…బీసీలు జగన్ వైపు నిలబడ్డారు. ఇలా నిలబడిన బీసీల మద్ధతు ఏ మాత్రం తగ్గిపోకుండా జగన్ ప్రయత్నిస్తూనే ఉన్నారు. అటు చంద్రబాబు ఏమో..మళ్ళీ బీసీలని దగ్గర చేసుకునే ప్రయత్నాలు చేస్తున్నారు.

ప్రస్తుతం రాజకీయం కాస్త టీడీపీకి అనుకూలంగా మారుతున్న సమయంలో బీసీలు అటు వైపుకు వెళ్లకుండా జగన్ సరికొత్త స్కెచ్ లతో ముందుకొస్తున్నారు…ఇప్పటికే ప్రభుత్వ, రాజకీయ పదవుల విషయంలో బీసీలకు 50 శాతం సీట్లు ఇచ్చిన విషయం తెలిసిందే…బీసీలకు చెందిన ఒక్కో కులానికి, ఒక్కో కార్పొరేషన్ ఏర్పాటు చేశారు. అటు మంత్రి వర్గంలో, రాజ్యసభ పదవుల్లో బీసీలకు సముచిత ప్రాధాన్యత ఇచ్చారు. ఇలా ఎక్కడకక్కడ బీసీలని అందలం ఎక్కిస్తూనే…వారి మద్ధతు చేజారిపోకుండా జగన్ ముందుకెళుతున్నారు.

ఇదే క్రమంలో తాజాగా వైసీపీ ఎంపీలు సరికొత్త డిమాండ్ తో ముందుకొచ్చారు…దేశంలో అత్యధిక జనాభా కలిగిన బీసీలకు…సెపరేట్ గా ఓ మంత్రిత్వ శాఖని ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. కేంద్రంలో విద్య, ఉద్యోగాలతో పాటు, పంచాయతీలలో బీసీలకు రిజర్వేషన్లు అమలువుతున్నాయని, వాటన్నింటికీ చూడడం కోసం ప్రత్యేకంగా మంత్రిత్వ శాఖ కావాలని వైసీపీ కోరుతుంది.

ఇలా డిమాండ్ చేయడం వల్ల బీసీలని తమ వైపుకు లాక్కోవాలనేది జగన్ ప్లాన్…ఒకవేళ కేంద్రంగాని ప్రత్యేకంగా బీసీ శాఖని ఏర్పాటు చేస్తే…వైసీపీకి ఇంకా అడ్వాంటేజ్.