2004లో విజయ‌వాడ సెంట్రల్ విన్న‌ర్ ఎవ‌రు… గ్రౌండ్ రిపోర్ట్ ఇదే…!

రాజ‌కీయంగా కీల‌క‌మైన న‌గ‌రం విజ‌య‌వాడలో రాజ‌కీయాలు పెద్ద ఎత్తున మారుతున్నాయి. ముఖ్యంగా.. సెంట్ర‌ల్ నియోజ‌క‌వ‌ర్గంలో రాజ‌కీయాలు మ‌రింత హాట్ టాపిక్‌గా మారాయి. ఇక్క‌డ నుంచి వ‌చ్చే ఎన్నిక ల్లో మ‌ళ్లీ వైసీపీ త‌ర‌ఫున సిట్టింగ్ ఎమ్మెల్యే మ‌ల్లాది విష్ణుకే ఇస్తార‌ని ప్ర‌చారం ఉంది. ప్ర‌స్తుతం ఆయ‌న ప్ర‌జ‌ల మ‌ధ్య ఉండ‌క‌పోయినా.. గ‌డ‌ప గ‌డ‌ప‌కు కార్య‌క్ర‌మాన్ని నిర్వ‌హించ‌క‌పోయినా.. బ్రాహ్మ‌ణ కోటాలో టికెట్‌ను ఆయ‌న‌కే ఇస్తార‌ని.. అంటున్నారు.

ఇక‌, టీడీపీ త‌ర‌ఫున‌.. మ‌ళ్లీ మాజీ ఎమ్మెల్యే బొండా ఉమా రెడీ అవుతున్నారు. ఆయ‌న‌కే టికెట్ ఇస్తార‌ని ప్ర చారం కూడా జ‌రుగుతోంది. ఇక‌, ఈయ‌న కూడా.. ప్ర‌జ‌ల మ‌ధ్య ఉండ‌డం లేద‌నే వాద‌న బ‌లంగా వినిపిస్తు న్నా.. అప్పుడ‌ప్పుడు.. మీడియా ముందుకువ చ్చి హ‌డావుడి చేస్తున్నారు. ప్ర‌భుత్వంపై విమ‌ర్శ‌లు చేస్తూ.. రాజ‌కీయాల్లో వేడి పుట్టించి.. మ‌ళ్లీ వెళ్లిపోతున్నారు. అయితే.. ఎన్నికల నాటికి.. వీరికి తోడు.. క‌మ్యూనిస్టు లు.. ఇత‌ర పార్టీలు కూడా జ‌త‌క‌లిసే అవ‌కాశం ఉంది.

 

ఎవ‌రు క‌లిసినా.. ఎవ‌రు క‌ల‌వ‌క‌పోయినా.. వ‌చ్చే ఎన్నిక‌ల్లో విజ‌య‌వాడ సెంట్ర‌ల్ నియోజ‌క‌వ‌ర్గం మాత్రం హాట్‌హాట్‌గా మారుతుంద‌ని అంటున్నారు. దీనికి కార‌ణం.. ఇద్ద‌రూ ఫైర్ బ్రాండ్స్ కావ‌డం.. ఇద్ద‌రూ కూడా మాస్ ఫాలోయింగ్ ఉండ‌డం. పైగా.. గ‌త ఎన్నిక‌ల్లో కేవ‌లం పాతిక ఓట్ల తేడాతోనే విష్ణు విజ‌యం ద‌క్కించు కున్నారు. అంటే.. ఇదేఫిగ‌ర్ తేడాతో టీడీపీ నాయ‌కుడు బొండా ఉమా ఓడిపోయారు. ఈ క‌సి.. వ‌చ్చే ఎన్నిక‌ల్లో మ‌రింత పెరిగి.. ఖ‌చ్చితంగా ఆయ‌న గెలుపు ప్ర‌య‌త్నం తీవ్రంగా ఉంటుంద‌ని అంటున్నారు.

స‌రే.. వ‌చ్చే ఎన్నిక‌లు ఎలా ఉన్నా.. గెలుపు నాదంటే.. నాదేన‌ని.. భావిస్తున్న ఈ ఇద్ద‌రు నాయ‌కులు కూడా స్థానికంగా ఉన్న స‌మ‌స్య‌ల‌ను మాత్రం ప‌ట్టించుకోక‌పోవ‌డం గ‌మ‌నార్హం. ప్ర‌జ‌లను క‌నీసం క‌లుసుకునేం దుకు ప్ర‌య‌త్నం చేయ‌డం లేదు.. వారికి ప్రాధాన్య‌మూ ఇవ్వ‌డం లేదు. దీంతో నాయ‌కుల మాట ఎలా.. ప్ర‌జ‌లు మాత్రం ఇబ్బందులు ప‌డుతున్నారు. గ‌డ‌ప‌.. గ‌డ‌ప‌కు కార్య‌క్ర‌మం కూడా పెద్ద‌గా హిట్ కాక‌పోయి నా.. త‌న‌కే టికెట్ ఇస్తార‌నే ధీమా, ఈ ద‌ఫా త‌ను గెలుపు గుర్రం ఎక్క‌డం ఖాయ‌మ‌ని.. టీడీపీ నేత‌.. భావించ‌డంతో ఇక్క‌డ రాజ‌కీయాలు కీల‌కంగా మారాయి.