బాబు..వంశీని ఆపేది ఎవరు?

జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వంపై వ్యతిరేకత పెరిగిపోయిందని, అసలు వైసీపీ ఎమ్మెల్యేలపై ప్రజలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారని, జగన్ పై ప్రజలకు కంపరం పుడుతుందని చెప్పి టీడీపీ పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్న విషయం తెలిసిందే…అసలు నెక్స్ట్ వైసీపీని ప్రజలు గెలిపించే అవకాశాలు లేవని, తమకే ప్రజలు పట్టం కట్టేస్తారని హడావిడి చేసేస్తున్నారు. అయితే టీడీపీ నేతల హడావిడి బాగానే ఉంది…కానీ క్షేత్ర స్థాయిలో కొన్ని నియోజకవర్గాల్లో టీడీపీకి బలం లేదనే సంగతి ఆ పార్టీ నేతలకు తెలుస్తున్నట్లు లేదు.

ఏదో మీడియాలో జగన్ ప్రభుత్వంపై విమర్శలు చేస్తే చాలు తమ బలం పెరిగిపోయిందని టీడీపీ నేతలు ఎక్కువ ఊహించుకుంటున్నారు. క్షేత్ర స్థాయిలోకి వెళితే వారి అసలు బలం ఏంటో అర్ధమవుతుందని చెప్పొచ్చు. అప్పుడు ప్రజలు వైసీపీని ఆదరిస్తారో..లేక టీడీపీని ఆదరించడానికి రెడీగా ఉన్నారో అర్ధం అవుతుంది. బలం లేకపోయిన టీడీపీ ఎక్కువ ఊహించుకుంటున్నట్లు కనిపిస్తోంది.

Vaartha Online Edition ఆంధ్రప్రదేశ్

ఉదాహరణకు కృష్ణా జిల్లాలో టీడీపీ బలంగా ఉంటుంది..అలాంటి జిల్లాలో కూడా టీడీపీ కష్టాల్లో ఉంది…ముఖ్యంగా గన్నవరం లాంటి స్థానాల్లో టీడీపీకి దిక్కు లేదు. వల్లభనేని వంశీ వైసీపీ వైపు వెళ్ళాక..గన్నవరం టీడీపీకి ఇంచార్జ్ గా బచ్చుల అర్జునుడుని పెట్టారు. ఆయన ఏమో పూర్తి స్థాయిలో నియోజకవర్గంలో పనిచేయడం లేదు. అక్కడున్న టీడీపీ శ్రేణులు ఏమో బలమైన నేతని ఇంచార్జ్ గా పెట్టాలని అడుగుతాయి..చంద్రబాబు ఏమో ఇంతవరకు ఆ పనిచేయలేదు.

పైగా వంశీపై వ్యతిరేకత పెరిగిపోయిందని, గన్నవరంలో టీడీపీ గెలుస్తుందని తమ్ముళ్ళు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తారు..కానీ క్షేత్ర స్థాయిలో పరిస్తితి అలా లేదు. వంశీని ఢీకొట్టే సత్తా టీడీపీకి లేదు. ఒకవేళ కమ్మ వర్గానికి చెందిన బలమైన నేతని గన్నవరం బరిలో దించితే ఏమైనా పోటీ ఇస్తారేమో గాని…లేదంటే గన్నవరం సీటుని ఈ సారి టీడీపీ కోల్పోవాల్సిందే. కాబట్టి ముందు గన్నవరంలో టీడీపీ బలపడే కార్యక్రమాలు చేస్తే బెటర్…అలా కాకుండా సోషల్ మీడియాలో హడావిడి చేస్తే వంశీ గెలుపుని ఆపలేరు.