సాయి పల్లవి “గార్గి” మూవీ: హిట్టా..ఫట్టా..?

లేడీ పవర్ స్టార్ అంటూ ఓ సరికొత్త ట్యాగ్ ను సంపాదించుకున్న సాయి పల్లవి .. గురించి ఎంత చెప్పినా తక్కువే. అమ్మడు అందాల ఆరబోతకు దూరంగా ఉన్నా కానీ..స్టార్ హీరోలకు ధీటుగా అభిమానులను సంపాదించుకుంది దానికి కారణం..సాయి పల్లవి చూస్ చేసుకునే సినిమా స్టోరీలు అలా ఉంటాయి. రీసెంట్ గా విరాట పర్వం సినిమాలో సరళ పాత్రలో మనల్ని మెప్పించిన ఈ మలయాళ బ్యూటీ..రీసెంట్ గా ఆమె ప్రధాన పాత్రలో నటించిన సినిమా..”గార్గి”.

గౌతమ్‌ రామచంద్రన్ దర్శకత్వం వహించిన సాయి పల్లవి గార్గి సినిమా కొద్ది గంటల ముందే ధియేటర్స్ లో రిలీజ్ అయ్యింది. న్యాయం కోసం పోరాడే ఓ టీచర్‌ కథే ఈ “గార్గి” అయితే, మనం ముందు నుండి అనుకున్నట్లే ఈ సినిమాలో సాయి పల్లవి తన నటనతో అభిమానులను ఆకట్టుకుంది. ఈ సినిమాలో టీచర్ గా ఆమె మనకు కనిపిస్తుంది. ఎంతో హ్యాపీగా ఉన్నదాంతో సాగిపోయే ఓ చిన్న ఫ్యామిలీలో..ఓ రాత్రి జరిగిన బాలిక రేప్ కేసు..ఎవ్వరు ఊహించని విధంగా..సాయి పల్లవి తండ్రి మెడకు చుట్టుకుంటుంది. తన తండ్రి ని అన్యాయంగా ఈ కేసులో ఇరికిమ్ని వారిని సాక్ష్యాలతో బయటపెడుతూ..సాయి పల్లవి..నటించిన తీరు అభిమానుల చేత శభాష్ అనిపించుకుంటుంది.

సినిమా మొత్తానికి సాయి పల్లవినే కనిపిస్తుంది. ఆమె ఈ సినిమాకి హీరో, హీరోయిన్..వన్ మెన్ ఆర్మీ లా స్టోరీని ముందుకు తీసుకెళ్తుంది. అయితే, సినిమా స్లో గా సాగుతుంది. కోర్టు సీన్స్ చాలా రొటీన్ గా కనిపించినా.. డైరెక్టర్ సాయి పల్లవి లోని టాలెంట్ ను బయటపెడుతూ..జనాలకు బోర్ కొట్టకుండా చేస్తాడు. ఇంటర్వెల్ సీన్స్ పెద్ద గా ఆకట్టుకోలేకపోయినా..క్లైమాక్స్ మాత్రం సూపర్బ్ గా తెరకెక్కించాదు డైరెక్టర్. ఓవర్ ఆల్ గా ఒక్క కామెడీ సీన్, వల్గర్ సీన్..లేకుండా..కేవలం న్యాయం అన్న కాన్సెప్ట్ పైనే సినిమాను లాక్కోచ్చాడు డైరెక్టర్. ఓవర్ ఆల్ గా కమర్షీయల్ గా ఈ సినిమా ఎక్కలేదు. సాయి పల్లవి నటన కోసం ఒక్కసారి ఈ మూవీ చూడచ్చు..అంటూ సినిమా చూసిన జనాలు రివ్యూ ఇస్తున్నారు. సినిమా అయితే పాజిటివ్ టాక్ దక్కించుకుంది..కానీ, కలెక్షన్స్ వచ్చే వరకు మనం ఏది డిసైడ్ అవ్వలేం అంటున్నారు సినీ విశ్లేషకులు..సో..లెట్స్ వెయిట్ అండ్ సీ..!!