చిరంజీవి కారణంగా డబ్బు నష్టపోయిన అల్లు అర్జున్.. సంచలన విషయాని బయటపెట్టిన బన్ని..!!

టాలీవుడ్ ఇండస్ట్రీలో మెగాస్టార్ చిరంజీవి అంటే..ఓ సపరేటు క్రేజ్ ఉంది. ఆయన యాక్టింగ్ స్టైల్ కి, డ్యాన్స్ స్టెప్పులకి మహా మహులు కూడా ఫిదా అవ్వాల్సిందే..అలాంటి డ్యాన్స్ ఆయన సొంతం. అయితే, అలాంటి చిరంజీవి కారణంగా అల్లు అర్జున్ డబ్బు నష్ట పోయాడట. ఈ విషయాని స్వయంగా అల్లు అర్జున్ చెప్పుకురావడం గమనార్హం. టాలీవుడ్ లో చిరంజివీ తరువాత అంతటి రేంజ్ లో డ్యాన్స్ చేయగలిగే వ్యక్తి అల్లు అర్జున్. అందుకే బన్నీ కి స్టైలీష్ స్టార్ అనే బిరుదు కూడా ఇచ్చారు.

అయితే, అలాంటి బన్నీ కి చిరంజీవి డ్యాన్స్ అంటే పిచ్చట. చిన్నప్పటి నుండి ఆయన డ్యాన్స్ , సినిమాలు చూస్తూనే పెరిగాను అని చెప్పుకొచ్చిన బన్నీ.. ఆ మధ్య ఓ ఇంటర్వ్యుల్లో మాట్లాడుతూ..చిరంజీవి ఇంద్ర సినిమాలో “దాయి దాయి దామ” సాంగ్ లో వీణ స్టెప్ అంటే చాలా ఇష్టం అన్ని..ఇప్పటికి ఆ పాటను ఎన్ని సార్లు చూసానో కౌంట్ లేదు అని చెప్పుకొస్తూ..ఆ పాట తో తనకు జరిగిన ఇన్సిడెంట్ ని గుర్తు చేసుకున్నారు.

“మా ఫ్రెండ్ తో ఈ సినిమా పాట గురించి మాట్లాడుతూ..ఈ సినిమాలో ఆ స్టెప్ టైంలో పక్కన హీరోయిన్ లేదని వాదించాడట . వాళ్ళ ఫ్రెండ్ ఏమో ఉంది అంటూ బెట్ వేశాడట. మొత్తం 25 వేలకు బెట్ వేసుకుని..ఇద్దరు సినిమాలో ఆ సాంగ్ ని ప్లే చేసి..ఆ స్టెప్ వచ్చే వరకు వెయిట్ చేసి..చూశారట. అప్పుడు బన్నీకి చిరు పక్కన సోనాలీ కనిపించిందట”. అంతలా చిరు డ్యాన్స్ చేస్తుంటే పక్కన ఎవ్వరు ఉన్నారు..అన్న సంగతి కూడా మర్చిపోయి చూస్తాను అని చెప్పుకొచ్చారు బన్ని . ఇక ఫ్రెండ్ ఆ డబ్బులను జేబులో పెట్టుకుని ..హ్యాపీగా వెళ్ళిపోయారట. అలా బన్నీ చిరంజీవి కారణంగా డబ్బులు నష్టపోయారనమాట.