మోడీ సంచలన నిర్ణయం..రూపాయి విలువ పెంచేందుకు కొత్త స్ట్రాటజీ ..!!

ఈ విషయం మనకు బాగా తెలిసిందే ప్రపంచంలోని ఏ ఆర్థిక వ్యవస్థకైనా కీలకమైనది కరెన్సీ. దాని విలువను బట్టే ఫైనాన్షీయక్ సెక్టార్ ఆధారపడి ఉంటుంది. ఏ దేశానికైనా ఇది కీలకం..అందుకే ఆ కరెన్సీ విలవను జాగ్రత్తగా కాపాడుతుంటాయి ఆయా సెంట్రల్ బ్యాంకులు. అయితే, ప్రస్తుత గ్లోబలైజేషన్ సమయంలో ప్రతి దేశం ఇతర దేశాలతో ఏదో ఒక రూపంలో వాణిజ్యా సంబంధాలు కలిగిఉన్నాయి. అంటే చెల్లింపులకు డాలర్ లేదా ఇతర సెటిల్ మెంట్ మార్గాల్లో అనమాట.

అయితే ఇప్పుడు మన ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మన కరెన్సీ వాల్యూ పెంచడానికి సరికొత్త స్ట్రాటజీ ని ఫాలో అవుతున్నట్లు తెలుస్తుంది. అదే ఇప్పుడు కీలకంగా మారాయి. గత కొన్ని నెలలుగా మన దేశంలో రూపాయి విలువ రోజు రోజుకి పడిపోతుంది..కారణాలు ఏవైనా కానీ దారుణంగా రూపాయి విలువ పతనం అవుతుంది. ఇది తీవ్ర సమస్యగా మారింది. దీని అరికట్టడానికి రిజర్వు బ్యాంక్ చాలా చర్యలు చేపట్టినప్పటికీ..ప్రయోజనం లేకుండా పోయింది. డాలర్ విలువ బలంగా ఉండటం వల్లే ఇలా జరుగుతుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

ఈ క్రమంలోనే మన రూపాయి విలవు పెంచేందుకు..RBI కొత్త పద్ధతిని తీసుకువచ్చింది. ప్రపంచ వాణిజ్య వృద్ధిని ప్రోత్సహించడానికి, భారత కరెన్సీలో వాణిజ్య చెల్లింపులకు మద్దతు ఇవ్వడానికి RBI కొత్త పద్ధతిని తీసుకువచ్చింది. ఇందుకు వీలుగా సోమవారం ఫారెన్ ట్రేడింగ్ లో రూపాయి సెటిల్మెంట్ వ్యవస్థను ఆవిష్కరించింది RBI. దీంతో ఈ కొత్త విధానం ద్వారా.. మనం ఎక్స్ పోర్టర్స్, ఇంపోర్టర్స్ రసీదులు, చెల్లింపుల కోసం ప్రత్యేక వోస్ట్రో ఖాతాను ఉపయోగించవచ్చు. దీని ప్రకారం ఇండియా నుండి చేసే చెల్లింపులను డాలర్లలో కాకుండా ఇక పై రూపాయల్లో చేయచ్చు.

ప్రస్తుతం ఈ పద్ధతిని రష్యా కి మనం వాడుకుంటున్నం. అక్కడ నుంచి దిగుమతి అవుతున్న చమురు ఇతర ఉత్పత్తుల చెల్లింపులను రూపాయల్లోనే చెల్లించేందుకు రష్యా ప్రభుత్వం అంగీకరించింది. ఇక ఇలానే రాబోయే కాలంలోను అన్ని దేశాలకు ఇలాంటి ప్రత్యేక పరిస్ధితినే కంటిన్యూ చేయించాలని ఆర్బీఐ చాలా గట్టిగా ప్రయత్నిస్తోంది. ఆర్బీఐ ప్రయత్నాలు సక్సెస్ అయితే ఇప్పుడు కాకపోయినా.. కొంతకాలానికి అయినా కచ్చితంగా పడిపోయిన రూపాయి విలువ పెరగటం ఖాయం అంటున్నారు విశ్లేషకులు..మరి చూడాలి.