విజయవాడ వైసీపీ అభ్యర్ధిగా కేశినేని?

తెలుగుదేశం పార్టీలో ఎంపీ కేశినేని నాని వ్యవహారం తీవ్ర చర్చనీయాంశమైంది…ఓ వైపు టీడీపీ…అధికార వైసీపీపై పోరాటం చేస్తుంటే నాని మాత్రం సొంత పార్టీపైనే పోరాటం చేస్తున్నారు…ముందు నుంచి పార్టీలోని తప్పిదాలని ఎత్తిచూపుతున్న నాని..ఈ మధ్య కాలంలో రోజుకో సంచలనానికి తెరలేపుతున్నారు. ఇప్పటికే విజయవాడ టీడీపీ నేతలతో నానికి పడటం లేదు…ఇక తాజాగా ఆయన సోదరుడు కేశినేని శివనాథ్ పై కూడా నాని విరుచుకుపడుతున్నారు. తనకు వ్యతిరేకంగా శివనాథ్ చేత రాజకీయం చేయిస్తున్నారని, విజయవాడ ఎంపీ టికెట్ ఇవ్వాలని చూస్తున్నారని ఫైర్ అవుతున్నారు. అలాగే కారుకు సంబంధించిన ఎంపీ వి‌ఐ‌పి స్టిక్కర్ విషయంలో కూడా రచ్చ జరిగిన విషయం తెలిసిందే.

ఇక దీని వెంటనే….ఢిల్లీలో కేశినేని సంచలన వ్యాఖ్యలే చేశారు…మీడియాతో ఆఫ్ ది రికార్డ్ మాట్లాడుతూ.. మహారాష్ట్రలో ఏక్ నాథ్ షిండేలా టీడీపీలో.. బీజేపీ ఎంపీ సీఎం రమేష్ ఉన్నాడని, వచ్చే ఎన్నికల్లో 50, 60 సీట్లు టీడీపీకి వస్తే ఏక్ నాథ్ షిండేలా సీఎం రమేష్ తో ఆపరేషన్ చేస్తారని, అప్పుడు టీడీపీని లేకుండా చేస్తారని మాట్లాడారు.

వచ్చే ఎన్నికల్లో కూడా టీడీపీ అధికారంలోకి రాదని, గెలిచే శక్తి, యుక్తి చంద్రబాబుకు లేదని, ఉన్నది ఉన్నట్లుగా చెప్పే వాళ్ళ మాటలు చంద్రబాబు నమ్మరని, బ్రోకర్లు, లోఫర్ల మాటలే చంద్రబాబు వింటారని విమర్శించారు. అలాగే నాని వ్యాఖ్యలపై రకరకాల చర్చలు మొదలయ్యాయి. ఆయన వైసీపీలోకి వెళ్లిపోతారనే ప్రచారం మొదలైంది. అలాగే విజయవాడ పార్లమెంట్ లో వైసీపీ అభ్యర్ధిగా నిలబడతారని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది.

ఈ క్రమంలో నాని మళ్ళీ స్పందిస్తూ…తనని బీజేపీలోకి, వైసీపీలోకి పంపించే బదులు… చెప్పింది అర్థం చేసుకొని.. పార్టీని పటిష్టపరచుకొని.. అధికారంలోకి ఎలా తీసుకురావాలో ఆలోచిస్తే మంచిది…అంటూ టీడీపీ అధిష్టానానికి చురకలు అంటించారు. మొత్తానికైతే టీడీపీలో కేశినేని వ్యవహారం…బాగా హాట్ టాపిక్ అయింది. మరి అసలు ఆయన టీడీపీలో ఉంటారో..లేక వైసీపీలోకి వెళ్తారో…అది కాదంటే రాజకీయాలకు దూరమవుతారో మాత్రం క్లారిటీ రావడం లేదు.